“రామ్ నగర్‌కు చెందిన సంపత్ప్రైవేట్ఎంప్లాయ్. మంగళవారం బంజారాహిల్స్ లోని ఆఫీసుకు వెళ్తున్నాడు. అతడు బైక్‌పై ఖైరతాబాద్ జంక్షన్ మీదుగా తాజ్‌కృష్ణ వైపు వెళ్తున్నాడు. ఓ చోట డ్రైనేజీ నీరంతా రోడ్డుపైనే పారుతుండగా కారు స్పీడ్ గా వెళ్లడంతో మురుగునీరు సంపత్‌పై పడింది. డ్యూటీకి వెళ్లకుండా ఇంటికి తిరిగి వెళ్లిపోయి డ్రెస్ చేంజ్చేసుకొని మళ్లీ మధ్యాహ్నం వెళ్లాడు. బల్దియా హెల్ప్‌లైన్ నంబర్‌కి కాల్చేసి కంప్లయింట్ చేశాడు. ఇప్పుడు డ్రైనేజీలను చూడడం లేదని వాటర్‌బోర్డుకు కంప్లయింట్ చేయాలని ఓ అధికారి సమాధానం ఇచ్చారు’’.
హైదరాబాద్, వెలుగు: సిటీలో రోడ్లపై డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నయ్. మెయిన్‌రోడ్లు, కాలనీలు, బస్తీలు అన్నిచోట్లా ఇలాంటి పరిస్థితే ఉంది. కిలోమీటర్ల మేర మురుగు పారుతుండడంతో పాటు కంపు వానస వస్తోంది. కార్లు, బైక్ లు స్పీడ్‌గా వెళ్తుంటే బైక్‌పై, నడిచి వెళ్లే వారిపై పడుతోంది. సమస్యపై కంప్లయింట్ చేస్తే అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. దీంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు డ్రైనేజీ వ్యవస్థను బల్దియా చూసింది. ఇప్పుడు ఆ బాధ్యతలను వాటర్‌బోర్డుకు బదిలీ చేసింది. మరోవైపు డ్రైనేజీ లీకేజీలపై జనాల నుంచి వచ్చే కంప్లయింట్స్ని కూడా బల్దియా తీసుకోవడం లేదు. తమకేం సంబంధం లేదని వాటర్‌బోర్డుకు కంప్లయింట్ చేయాలని ఆఫీసర్లు సమాధానమిస్తున్నారు. వాటర్ బోర్డుకు కంప్లయింట్ చేసిన వెంటనే స్పందించకపోతుండగా రోజురోజుకు సమస్య తీవ్రమవుతుంది.
అన్నిచోట్ల అంతే..
జూబ్లీహిల్స్ నుంచి బస్తీల వరకు అన్ని చోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోజుల తరబడి ఇలాగే ఉంటున్నా పట్టించుకోవడం లేదు. దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఎర్రమంజిల్ నుంచి తాజ్‌కృష్ణకు వచ్చే రూట్లో రెండు డ్రైనేజీలు, మెహిదీపట్నం చౌరస్తా, మాసబ్‌ట్యాంక్, రెడ్‌హిల్స్, అశోక్‌నగర్, సరోజినిదేవి హాస్పిటల్వద్ద, టోలిచౌకీ, ఫిలింనగర్ బస్టాపు వద్ద, జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ వద్ద డ్రైనేజీలు పొంగి రోడ్డుపై కిలో మీటర్ల మేర మురుగు పారుతోంది. సరూర్ నగర్, ఎల్బీనగర్, ఉప్పల్ అన్నిచోట్ల డ్రైనేజీల పరిస్థితి ఇలాగే ఉంది. రోడ్లపై వరదల పారుతున్నా కూడా పట్టించుకోకపోవడంతో అధికారులపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.