మద్యానికి డబ్బులు లేక కారు చోరీ.. ఇద్దరు అరెస్ట్

  • ఇద్దరిని అరెస్ట్ చేసిన నాగోల్ పోలీసులు 

ఎల్​బీనగర్, వెలుగు : మద్యానికి డబ్బులు లేక కారును చోరీ చేసిన నిందితులను నాగోలు  పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. నాగోల్ కు చెందిన గడుల మహేశ్, బండి మనోజ్ కుమార్ జల్సాలకు అలవాటు పడ్డారు. ఈజీగా మనీ సంపాదించాలని ప్లాన్ చేశారు. పాతబస్తీ షాహిన్ నగర్ కు చెందిన అజయ్ జమీ క్యాబ్ డ్రైవర్.  ఈనెల 27న అర్ధరాత్రి ఉప్పల్ నుంచి షాహిన్ నగర్ కు కారులో వెళ్తున్నాడు.  

నాగోలు ఫ్లై ఓవర్ వద్ద స్వీగ్గి డెలివరీ బాయ్ కారు ఆపి పర్సు దొరికిందని, అందులో యజమాని ఫోన్ నెంబర్ ఉందని చెప్పి అతనికి కాల్ చేయించాడు. ముందుస్తు ప్లాన్ లో భాగంగా అక్కడి వచ్చిన మహేశ్, మనోజ్ కుమార్ కారు చోరీ చేసి పారిపోయారు. బాధితుడు  ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. 

మంగళవారం రాత్రి ఇద్దరు నిందితులను ఓ బార్ వద్ద అరెస్టు చేసి కారుతో పాటు బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. కారును అమ్మగా వచ్చిన డబ్బుతో మద్యం తాగి జల్సాలు చేసేందుకు ప్లాన్ చేసినట్లు నిందితులు చెప్పినట్టు పోలీసులు తెలిపారు.