రాఖీ పండక్కి బాగా తినేశారా.. ఈ డిటాక్స్ డ్రింగ్స్ తాగండి.. యాక్టివ్ అవుతారు..

రాఖీ పండక్కి బాగా తినేశారా.. ఈ డిటాక్స్ డ్రింగ్స్ తాగండి.. యాక్టివ్ అవుతారు..

' పండుగ పూట 'తినొద్దు' అనుకున్నా కూడా స్వీట్లు, పిండివంటలు తినేస్తారు చాలామంది. దాంతో డైట్ ప్లాన్ దెబ్బతింటుంది. ఇంకేముంది బాడీ డల్ అవుతుంది. అలాంటప్పుడు డీటాక్స్ ఒంట్లోని మలినాల్ని పోగొడతాయి. డ్రింక్స్ తాగితే యాక్టివ్ అవుతారు. వీటిని ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.

  • కప్పు నీళ్లలో కొంచెం పసుపు, అల్లం, నల్లమిరియాల పొడి, తేనె వేయాలి. ఈ నీళ్లని మరిగిస్తే పసుపు టీ రెడీ. ఈ టీ టాక్సిన్లని తొలగిస్తుంది. పసుపులోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు జీర్ణక్రియలు సరిగా జరిగేలా చేస్తాయి.
  • నిమ్మరసం, అల్లం, తేనె కలిపి తయారు చేసిన టీని ఉదయాన్నేతాగాలి. ఈ టీ తాగితే మెటబాలిజం స్పీడ్గా జరుగుతుంది...

ALSO READ:ఐస్ ప్యాక్ తో తలనొప్పి మాయం..

  • డీటాక్స్ పాటు రీ-హైడ్రేషన్ కోసం కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, పుదీనా కలిపిన డ్రింక్ తాగాలి. కొబ్బరినీళ్లు శక్తినిస్తాయి. నిమ్మరసం, పుదీనా ఒంట్లోని మలినాల్ని పోగొడతాయి.
  • తాజా కమలా, అల్లం, క్యారెట్ లని మిక్సీలో గ్రైండ్ చేసి జ్యూస్ తీయాలి. ఈ జ్యూస్లో ఉండే విటమిన్-సి, బీటా కెరొటిన్, ఫైబర్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని డీటాక్స్ చేయంతో పాటు జీర్ణక్రియల్ని మెరుగుపరుస్తాయి.
  • సరిగ్గా జీర్ణం కావాలంటే దానిమ్మ, బీట్రూట్ జ్యూస్ తాగాలి. ఈ జ్యూస్ శరీరాన్ని శుభ్రం . చేస్తుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది కూడా.