డ్రింకర్ సాయి ఫస్ట్ లుక్ విడుదల

డ్రింకర్ సాయి ఫస్ట్ లుక్ విడుదల

ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా కిరణ్  తిరుమలశెట్టి దర్శకత్వంలో బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్న చిత్రం ‘డ్రింకర్ సాయి’. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ట్యాగ్‌‌లైన్. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్‌‌ను డైరెక్టర్ మారుతి లాంచ్ చేసి టీమ్‌‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు.

ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని మేకర్స్ తెలియజేశారు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌‌ని అనౌన్స్ చేస్తామన్నారు.   పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, భద్రం, కిర్రాక్ సీత, రీతు చౌదరి ఇతర పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వసంత్ సంగీతం అందిస్తున్నాడు.