యూత్‌‌ఫుల్ కంటెంట్‌‌తో ‘డ్రింకర్ సాయి’

యూత్‌‌ఫుల్ కంటెంట్‌‌తో ‘డ్రింకర్ సాయి’

ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా కిరణ్  తిరుమలశెట్టి దర్శకత్వంలో బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించిన  చిత్రం ‘డ్రింకర్ సాయి’. ఈ నెల 27న సినిమా విడుదల కానుంది. సోమవారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు.  హీరో ధర్మ మాట్లాడుతూ ‘మా ట్రైలర్ చూసి నన్ను కొంతమంది తిడుతున్నారు. కానీ సినిమా అలా ఉండదు. ఈ ‘డ్రింకర్ సాయి’ అందరికీ  నచ్చుతాడని బల్లగుద్ది చెబుతున్నా. మేము కొంతమంది పెద్ద వయసు వాళ్లకు షో వేశాం. వాళ్లలో వందకు వంద మంది ఎక్కడా ఇబ్బంది పడలేదు.

సినిమా బాగుందన్నారు. అలాగే ఇంజినీరింగ్  స్టూడెంట్స్, ఆటో డ్రైవర్స్, తాపీ మేస్త్రీలకు  షో వేశాం. అందరి నుంచీ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మా టీమ్‌‌లో  ఎవరూ డబ్బుల కోసం పనిచేయలేదు’ అని చెప్పాడు. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పింది హీరోయిన్ ఐశ్వర్య. ఇందులో మంచి రోల్ చేశానంది ‘బిగ్‌‌బాస్’ ఫేమ్ కిర్రాక్ సీత. యూత్‌‌ఫుల్ కంటెంట్‌‌తో ఈ చిత్రం రాబోతోందని డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టి చెప్పాడు.  ఫ్యామిలీ ఆడియెన్స్‌‌తో పాటు యూత్‌‌కు  నచ్చేలా సినిమా ఉంటుందని నిర్మాతలు అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.