దివాళీకి అవీ ఇవీ తింటున్నారా.. మీ కడుపును ఇలా జాగ్రత్తగా చూసుకోండి.. !

దివాళీకి అవీ ఇవీ తింటున్నారా.. మీ కడుపును ఇలా జాగ్రత్తగా చూసుకోండి.. !

దేశవ్యాప్తంగా దీపావళి పండుగ శోభ సంతరించుకుంది. ముఖ్యంగా దీపావళి అంటే టపాసులతో పాటు పిండి వంటలకు ఫేమస్.  దీపావళి రోజున ఇండ్లలో రకరకాల పిండి వంటకాలు రెడీ చేస్తారు. మరి కొందరు వెజ్‎తో పాటు నాన్ వెజ్ వంటకాలు కూడా వండుతారు. ఈ వంటకాలన్నీ ఒక్క చోట కనిపిస్తే ఇక ఆహారప్రియులు ఊరుకుంటారా.. వెంటనే లాగించేస్తారు. అయితే, ఇలా దొరింది దొరికినట్లే లాగించేస్తే స్టమక్ అప్సేట్ అయ్యే ఛాన్స్ ఉంది. 

దీంతో పండుగ వేళ కడుపు నొప్పి, ఇతర జీర్ణాశయ సమస్యలు  రావొద్దంటే కొన్ని చిట్కాలు పాటిస్తే.. పండుగను హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇందు కోసం మీరు చేయాల్సింది ఏంటంటే.. వరుసగా రెండు రోజుల పాటు ఉదయాన్ని పాలు, కాఫీ, టీకి బదులు సెలెరీ వాటర్ తాగడమే. వరుసగా రెండు రోజులు సెలరీ వాటర్ తాగితే కడుపు క్లీన్ అవుతోందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

జీర్ణాశయ సమస్యలు దూరమవడమే కాకుండా.. సెలరీ వాటర్‎తో ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు హెల్త్ ఎక్స్‎పర్ట్స్. సెలెరీ టీ తాగడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, గుండెల్లో మంట, ఉబ్బరం వంటి అనేక వ్యాధులు నయమవడంతో పాటు బరువు కూడా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ఈ సెలెరీ వాటర్ ఎలా చేసుకోవాలని డౌట్ వచ్చింది. ఏం లేదు.. ఇంట్లోనే సింపుల్‎గా సెలెరీ వాటర్ తయారు చేసుకుని తాగొచ్చు. అది ఎలాగో చూద్దాం. 

సెలెరీ నీటిని ఎలా తయారు చేయాలి..?

దీని కోసం, రాత్రిపూట 1 గ్లాసు నీటిలో 1 టీస్పూన్ సెలెరీని నానబెట్టండి. ఉదయం, సెలెరీతో పాటు ఈ నీటిని మరిగించండి లేదా కొద్దిగా వేడి చేయండి. ఇప్పుడు దాన్ని ఫిల్టర్ చేసి గోరువెచ్చని నీటిని తాగాలి. మీరు ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగాలి. దీని తర్వాత దాదాపు 30 నిమిషాల వరకు ఏమీ తినవద్దు.

సెలెరీ నీటిని ఎలా తయారు చేయాలి?

 రాత్రిపూట 1 గ్లాసు నీటిలో 1 టీస్పూన్ సెలెరీని నానబెట్టండి. ఉదయం లేవగానే సెలెరీతో పాటు ఈ నీటిని గోరు వెచ్చగా వేడి చేయండి. అనంతరం వడపోసి గోరువెచ్చని నీటిని తాగాలి. అయితే, ఉదయం లేవగానే ఖాళీ కడుపుతోనే ఈ సెలెరీ వాటర్ తాగాలి. తాగిన తర్వాత 30 వరకు నిమిషాల వరకు ఏమీ తినవద్దు గుర్తు పెట్టుకోండి. 

సెలెరీ వాటర్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:

ప్రతిరోజు ఉదయాన్నే సెలెరీ వాటర్ తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు ఊబకాయం వంటి సమస్యలకు పరిష్కారం లభిస్తోంది. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది.
గ్యాస్, అసిడిటీ సమస్యలు ఉన్నవారు ఈ సెలెరీ వాటర్ తాగడం వలన చాలా ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సెలెరీ ఆకుల్లో ఉండే పోషకాలు జీర్ణవ్యవస్థను పటిష్టం చేసి మలబద్దకాన్ని దూరం చేస్తాయి. ఆస్తమా, శ్వాస, గొంతు, ముక్కు వంటి సమస్యలకు కూడా ఈ సెలెరీ వాటర్ ఔషదంలో పని చేస్తోందంటున్నారు హెల్త్ ఎక్స్‎పర్ట్స్