పొద్దున లేవగానే నిద్ర మత్తు వదిలి మైండ్ యాక్టివ్ చేసేందుకు ఒక కాఫీ. ఈవెనింగ్ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే... అలసట తీర్చేందుకు మరో కప్పు కాఫీ. చల్లగా ఉండే ఈ సీజన్ లో రోజుకు వీలైనన్నిసార్లు తాగాలనిపించేది వెచ్చటి కాఫీ. కాఫీని అంతగా ఇష్టపడే వాళ్లందరికీ ఇదొక గుడ్ న్యూస్.
డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తేచాలు..“కాస్త కాఫీలు తాగడం తగ్గించండి" అంటుంటారు. కానీ... అలా అనేవారికి కూడా ఇప్పుడు ఆన్సర్ ఇవ్వొచ్చు. ఎందుకంటే కాఫీ ఎక్కువగా తాగడం వల్ల ఒక జబ్బును రాకుండా ఆపేయొచ్చట. ఆశ్చర్యంగా ఉందా? కానీ నిజం. ఆస్ట్రేలియాలోని ఎడిత్ కొవన్ యూనివర్సిటీ (ఈసీయు) చేసిన స్టడీ... కాఫీ ఎక్కువ సార్లు తాగడం వల్ల అల్జీమర్స్ వ్యాధి తగ్గుతుందని తేలింది.
ఆస్ట్రేలియన్ ఇమేజింగ్, బయో మేకర్స్ అండ్ లైఫ్ స్టడీ ఆఫ్ ఏజింగ్ గురించి చేసిన స్టడీలో భాగంగా “ఎడిత్ కోవన్ యూనివర్సిటీ, (ఈసీయు) ఈ కాఫీ ఇన్వెస్టిగేషన్ చేసింది. ఆ స్టడీలో ఈ విషయం రుజువైంది. కాఫీ ఎక్కువగా తాగే రెండొందల మంది మీద పదేండ్ల పాటు రీసెర్చ్ చేశారు. వాళ్లలో అల్జీమర్స్ కి సంబంధించిన లక్షణాలని పరిశీలించారు. అయితే... కాఫీ ఎక్కువగా తాగడం వల్ల ప్లానింగ్, సెల్ఫ్ కంట్రోల్ వంటివి మర్చిపోకుండా చేయగలుగుతున్నారట.
అంతేకాకుండా అల్జీమర్స్ ని డెవలప్ చేసే ముఖ్యమైన ఫ్యాక్టర్ బ్రెయిన్లోని అమైలాయిడ్ ప్రొటీన్. అయితే కాఫీ ఎక్కువగా తాగే వాళ్లలో అమైలాయిడ్ ప్రొటీన్ ఉత్పత్తి తగ్గింది. అంటే అల్జీమర్స్ ని కంట్రోల్ చేసినట్టే అంటున్నారు ఈ రీసెర్చిని లీడ్ చేసిన డాక్టర్ సమంతా గార్డెనర్. ఇప్పటికైతే కాఫీతో అల్జీమర్స్ కి చెక్ పెట్టొచ్చన్న విషయం దాదాపుగా కన్ఫార్మ్ అయింది.
కాబట్టి ఎంచక్కా మిడిల్ ఏజ్ వాళ్లు ఈ కాఫీ చిట్కాని ఫాలో అయిపోవచ్చు. ఉదాహరణకు, 240 గ్రాముల కాఫీని రోజుకు రెండు సార్లు తాగితే 18 నెలల్లో ఐదు శాతం అమైలాయిడ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. అయితే దీని మీద ఇంకా రీసెర్చ్ చేయాల్సిన అవసరముంది. కాఫీలో ఉండే, క్రూడ్ కెఫిన్, ఎలుకల్లో మెమరీ ప్రాబ్లమ్స్ రాకుండా చేసినట్లు రుజువైంది. అదేకాకుండా కెఫెస్టోల్ వంటి మిగతా కాఫీ బై ప్రొడక్ట్స్ కూడా మిగతా జంతువుల్లో మెమొరీ ప్రాబ్లమ్స్ మీద పనిచేస్తున్నాయని చాలా స్టడీల్లో వెల్లడైందన్నారు డాక్టర్ గార్డినర్.
ALSO READ : డంకీ మూవీ కోసం షాకింగ్ బడ్జెట్.. ఇంతకీ ఇది షారుఖ్ సినిమానేనా?