ఈరోజుల్లో మందు లేనిదే ఒక పండగ అవడం లేదు. పార్టీ అవడం లేదు. దావత్ అంటే చుక్క, ముక్క ఉండాల్సిందే. పార్టీల్లో, పండగల్లో ఆల్కహాల్ పుచ్చుకోవడం మాములు విషయమైపోయిన ప్రస్తుత తరుణంలో మద్యం ప్రియుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. మన దేశంలో మద్యాన్ని ఇష్టంగా పుచ్చుకునేవాళ్లలో ఆల్కహాల్లో కూల్ డ్రింక్స్ కలుపుకుని తాగేవాళ్లే ఎక్కువ. అలా తాగడం వల్ల మద్యం ప్రభావం శరీరంపై నేరుగా ఉండదని, కూల్ డ్రింక్ మిక్స్ చేసుకుని తాగడం వల్ల టేస్ట్ తో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటారని ఎక్కువ మంది మద్యపాన ప్రియులు నమ్ముతుంటారు.
ALSO READ | Good Health : మీకు షుగర్ ఉంటే.. ఈ 8 రకాల డ్రైఫ్రూట్స్ అస్సలు తినొద్దు
అయితే.. ఇలా మద్యంలో కూల్ డ్రింక్ కలుపుకుని తాగడంపై అధ్యయనం చేయగా ఇలా తాగడం అత్యంత ప్రమాదకరమని తేలింది. కూల్ డ్రింక్స్లో కెఫైన్తో పాటు క్యాలరీలు, షుగర్ కంటెంట్ ఉంటుందని.. అలాంటి కోల్డ్ డ్రింక్స్ మద్యంతో కలిపి తీసుకోవడం వల్ల మరిన్ని అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధ్యయనం చేసిన నిపుణులు అభిప్రాయపడ్డారు. కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, సోడాలో కెఫైన్ అధిక మోతాదులో ఉంటుంది. ఆల్కహాల్ తో ఈ డ్రింక్స్ కలవడం వల్ల శరీరం అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని నివేదికలో వెల్లడించారు.
ALSO READ | ప్రతి విషయంలో పాజిటివ్ మైండ్సెట్ తో ఉండాలంటే.?
కెఫైన్ ఉండే డ్రింక్స్ తాగడం అలవాటైతే ఒక వ్యసనంగా మారే ప్రమాదం ఉందని, మద్యంతో కలిపి తాగడం వల్ల మద్యానికి బానిసయ్యే అవకాశం లేకపోలేదని తెలిపారు. అంతేకాకుండా.. మందులో కూల్ డ్రింక్ కలిపి తీసుకోవడం వల్ల కళ్లు దురద పెట్టడం లాంటి లక్షణాలు కూడా ఉంటాయని తేల్చారు. కాకపోతే.. మద్యం మత్తులో ఉండటం మూలాన ఈ విషయాన్ని మద్యపాన ప్రియులు గ్రహించలేరని వివరించారు. హార్ట్ సంబంధిత సమస్యలు ఉన్నవారు మద్యంతో కూల్ డ్రింక్స్ అసలు కలిపి తాగొద్దని హెచ్చరించారు. కెఫైన్, ఆల్కహాల్ కలిస్తే రక్తపోటు పెరిగే ప్రమాదం ఉందని.. బీపీ లెవెల్స్ అటూఇటూ అయితే గుండెపోటు కూడా రావొచ్చని నిపుణులు చెబుతున్న మాట. అందువల్ల.. హృదయ సంబంధ సమస్యలు ఉన్నవాళ్లు మందు, కూల్ డ్రింక్స్ పొరపాటున కూడా కలిపి తాగొద్దని హెచ్చరిస్తున్న పరిస్థితి.