ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో కాలుష్యం ఒకటి. వాయుకాలుష్యం, ధ్వని కాలుష్యం.. వీటితో పాటు మనం తాగే నీరు, తినే ఆహ్వారం కూడా పూర్తిగా కలుషితం అయి అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. ఇందులో ముఖ్యంగా మనం వాడే బాటిల్స్, బాక్సులను మైక్రోప్లాస్టిక్స్, టినీ ప్లాస్టిక్ వాడకం ద్వారా ఆహారం, వాటర్ కాలుష్యం పెరిగిపోతుంది.
మైక్రో ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యంపై చాలా తీవ్రమైన ప్రభావం చూపుతాయంటున్నారు పరిశోధకులు.గుండెజబ్బులు, హార్మోన్లు అసమతుల్యత, క్యాన్సర్లకు కారణమవుతున్నాయని ఇటీవల జరిపిన పరిశోధనల్లో డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ లో వినియోగించే మైక్రోప్లాస్టిక్ రక్తంలోకి చేరి రక్తపోటు దారి తీస్తుందని తేలింది.
ఆస్ట్రియాలోని డాన్యూబ్ ప్రైవేట్ యూనివర్సిటీలోని మెడిసిన్ డిపార్ట్ మెంట్ జరిపిన పరిశోధనల్లో మైక్రోప్లాస్టిక్ వల్ల రక్తపోటు పెరుగుతుందని వెల్లడైంది. ప్లాస్టిక్ బాటిళ్లలో ప్యాక్ చేసిన పానీయాలను తీసుకోకూడదు అని ఈ అధ్యయనం చెబుతోంది.
మైక్రోప్లాస్టిక్‌లు శరీరంలోకి ప్రవేశించకుండా ఉండాలంటే పంపు నీటిని మరిగించి తాగాలి లేదా ఫిల్టర్ చేయాలని ఈ పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ పద్ధతులు మైక్రోప్లాస్టిక్‌లు , నానోప్లాస్టిక్‌ల ఉనికిని దాదాపు 90శాతం తగ్గిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.