ఎండాకాలంలో కూలింగ్, ఫ్రిడ్జ్ వాటర్ తాగుతున్నారా... : ఈ ఐదు రోగాలు రావటానికి 80 శాతం ఛాన్స్.. బీ కేర్ ఫుల్

ఎండాకాలంలో కూలింగ్, ఫ్రిడ్జ్ వాటర్ తాగుతున్నారా... : ఈ ఐదు రోగాలు రావటానికి 80 శాతం ఛాన్స్.. బీ కేర్ ఫుల్

ఎండా కాలం వచ్చిందంటే చాలు చల్లచల్లని పదార్థాలు.. డ్రింక్స్ కోసం తహతహలాడటం కామన్. తీవ్రమైన ఎండ.. బాడీలోని వాటర్ కంటెంట్ ను పీల్చేస్తుంటే ఇన్స్టంట్ రిలీఫ్ కోసం కూల్ వాటర్ తాగుతుంటాం. కాసేపు బయటికి వెళ్లి వచ్చేసరికి బాడీ మొత్తం డీహైడ్రేట్ అవుతుంటుంది. ఈ పరిస్థితుల్లో చల్లని వాటర్, జ్యూస్, లస్సీ, ఫ్రూట్ సలాడ్స్ తీసుకుని అప్పటికప్పుడు ఉపశమనం పొందుతుంటాం. కూల్ వాటర్ తాగటం వలన ఎండ వేడి నుంచి రిలీఫ్ రావటమే కాకుండా బాడీకి ఫ్రెష్ నెస్ వస్తుంది. అయితే సమ్మర్ లో చిల్డ్ వాటర్ తాగటం వలన 5 రకాల రోగాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. సమ్మర్ లో కూలింగ్, ఫ్రిడ్జ్ వాటర్ తాగటం అంత డేంజరా.. తెలుసుకోవాల్సిందే..!

సమ్మర్ లో కూల్ వాటర్ తాగాలనుకోవటం వరకు ఓకే. కానీ కొందరు ఫ్రిడ్జ్ లో ఓవర్ కూల్ చేసుకుని తాగుతుంటారు. కొందరు వాటర్ లో ఐస్ క్యూబ్స్ వేసుకుని తాగుతుంటారు. అంతే కాకుండా జ్యూస్, లస్సీలలో ఐస్ క్యూబ్స్ వేసుకుని చిల్డ్ గా సేవిస్తుంటారు. దీనివలన ఆరోగ్య సమస్యలు రావడం పక్కా. చాలా సీరియస్ కండిషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని చెబుతున్నారు వైద్యులు. అవేంటో చదవండి. 

1.జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుంది:

ఐస్ వాటర్ తాగటం వలన డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కూల్ వాటర్ డైజెషన్ కావడానికి చాలా సమయం పడుతుంది. కొంత మంది తింటుంటే కూడా చల్లని నీళ్లు తాగుతుంటారు. దీని వలన బాడీలోని శక్తి ఐస్ వాటర్ టెంపరేచర్ ను నార్మలైజ్ చేయడానికే సరిపోతుంది. ఐస్ వాటర్ సాధారణ ఉష్ణోగ్రత రావడానికి బాడీకి చాలా సమయం పడుతుంది. అంటే తిన్న ఆహారం జీర్ణం చేయడానికి బదులు.. టెంపరేచర్ నార్మలైజ్ చేయడానికి జీర్ణాశయ శక్తి సరిపోతుంది. దీంతో జీర్ణ వ్యవస్థ పని చేయడం స్లో అవుతుంది. అందు వలన తినే సమయంలో చిల్డ్ వాటర్, కూల్ వాటర్ తాగక పోవడం బెటర్. 

2. గొంతు సమస్యలు:

కూల్ వాటర్ తాగటం వలన శరీరం అంతర్గతంగా చాలా వరకు శ్లేష్మ రసాన్ని (జిగట పదార్థం, గళ్ల, చీమిడి లాంటిది) ఉత్పత్తి చేస్తుంది. దీని వలన బొంగురు గొంతు రావడం, జలుబు, దగ్గు, కఫం రావడం, గొంతు వాయడం మొదలైన సమస్యలు వస్తుంటాయి. ఎవరికైతే శ్వాసకోస సంబంధ వ్యాధులు ఉంటాయో వాళ్లు కూల్ వాటర్ తాగక పోవడం మంచిది. 

3. తలనొప్పి:

ఎండ నుంచి వచ్చి న వెంటనే చల్లని నీళ్లు తాగడం వలన హెడేక్ (తలనొప్పి) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కూల్ వాటర్ తాగడం వలన వెన్నుపాముకు (స్పైన్) సంబంధించిన నరాలన్నీ చల్లబడతాయి. ఇవి బ్రైన్ (మెదడు)పై ప్రభావం చూపిస్తాయి. దీనివలన హెడేక్ వస్తుంటుంది. సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు పొరపాటున కూడా కూల్ వాటర్ తాగకూడదు. సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. 

4. పైల్స్ (మొలలు) వచ్చే అవకాశం:

ఎక్కువ రోజులుగా కూల్ వాటర్ తాగుతూ ఉంటే మొలల (పైల్స్) వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కూల్ వాటర్ తాగటం వలన మలం గట్టిపడి పోయి చివరికి మొలల సమస్యకు దారితీస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. మరీ చల్లని ఐస్ వాటర్ తాగటం వలన పేగుల్లో పుండ్లు ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుంది. దీని వలన మలంలో రక్తం రావడం, కడుపు నొప్పి రావడం జరుగుతుంటుంది. 

5. డీహైడ్రేషన్-బాడీలో నీటిశాతం తగ్గుతుంది:

కూల్ వాటర్ తాగడం వలన డీహైడ్రేషన్ వస్తుందంటే మీరు ఆశ్చర్యానికి గురవుతారేమో. కానీ ఇది నిజం. ఎందుకంటే కూల్ వాటర్ కొద్ది మొత్తంలో తాగితే దాహం తీరినట్లు అనిపిస్తుంటుంది. దీని వలన తక్కువ నీళ్లు తాగుతుంటాం. దీంతో బాడీలో డీహైడ్రేషన్ పెరుగుతుంది. ఈ కండిషన్ మరిన్ని ఆరోగ్య సమస్యలను తెచ్చి పెడుతుంది. 

అందువలన ఐస్ వాటర్ తాగడం ఆరోగ్యానికి హానికరం అనే విషయం గుర్తించుకోవాల్సిందే. కూల్ వాటర్ తాగటం మానేసి.. రూమ్ టెంపరేచర్ లో నార్మల్ వాటర్ తాగడం చాలా చాలా శ్రేయష్కరం. ఒకవేళ సమ్మర్ కదా.. కూల్ వాటర్ తాగకుండా ఎలా అని మీకు అనిపిస్తే.. రెగ్యులర్ గా తాగే నార్మల్ వాటర్ కంటే కొంచెం కూల్ గా ఉండేలా చూసుకోండి. అంతేకాని మరీ కూల్ గా తాగితే మాత్రం రోగాలను కొని తెచ్చుకున్నట్లే అంటున్నారు న్యూటిషనిస్ట్లు.