జర్మనీ దేశం.. జర్మనీలో మందు తాగటం అనేది చాలా చాలా కామన్. బహిరంగ ప్రదేశాల్లోనూ మందు కొట్టటం నేరం కాదు. అంతెందుకు మన దగ్గర 21 ఏళ్ల వరకు మందు తాగటం నేరం కదా.. జర్మనీ దేశంలో 14 ఏళ్ల నుంచే మందు కొట్టచ్చు. పార్కులు, రోడ్ల పక్కన, పబ్లిక్ ప్లేసుల్లోనూ మందు కొట్టొచ్చు.. మందు అనేది జర్మనీలో చాలా చాలా కామన్. బీరు, వైన్ అయితే మనం మంచినీళ్లు, టీ, కాపీ తాగినట్లు తాగుతారు. ఇదంతా ఒకప్పటి మాట.. ఇప్పుడు జర్మనీ యువతలో విపరీతమైన మార్పులు వచ్చాయంట.. మందు మానేయాలనే సంకల్పానికి వచ్చారంట.. జర్మనీ దేశంలోని ఈ మార్పు ఇప్పుడు ప్రపంచ దేశాలను సైతం షాక్ కు గురి చేస్తోంది.
జర్మనీలో ఒక్కో వ్యక్తి సంవత్సరానికి 107 లీటర్ల బీరు తాగుతారు. ఇది 2013 సంవత్సరం లెక్కలు. 2023 నాటికి ఇది 88 లీటర్లకు పడిపోయింది. అంటే ఒక్కో వ్యక్తి 35 లీటర్ల బీరును తగ్గించేశాడు.ఇక వైన్ విషయానికి వస్తే ఏటా లీటర్ వైన్ తాగటం తగ్గించేశారంట..
ALSO READ | మొబైల్ బానిసలుగా ఇండియన్స్..రాత్రీపగలూ లేకుండా సెల్ఫోన్లోనే..
మందు అనేది జర్మనీయుల సంస్కృతి, సంప్రదాయాల్లోనే భాగం. ఒకటో శతాబ్ధం నుంచి ఈ మద్యం అలవాటు అక్కడ ఉంది.
మారిన కాలంతో మందు మానేయాలని యువత గట్టిగా భావిస్తుందంట. అనారోగ్య సమస్యలు, బరువు పెరగటం, మందు తాగటం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని క్రమంగా మందుకు దూరం అవుతున్నారంట.
నేటి యువత అయితే ఆల్కాహాల్ ఫ్రీ బీర్ల వైపు వెళుతున్నదంట. మత్తు లేని బీరు.. పదేళ్లలోనే ఆల్కాహాల్ ఫ్రీ బీరు సేల్స్ ఏకంగా డబుల్ అయినట్లు చెబుతున్నారు. జర్మనీలో 2 కోట్ల మంది వరకు మందు బానిసలు ఉన్నారంట..