
ఒక సగటు మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి..? ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి..? ఇది ప్రస్తుతం బిజీ లైఫ్ కు అలవాటుపడిన ప్రతి ఒక్కరిలో ఉండే ప్రశ్న. ఏ ఛాన్నల్ ఓపెన్ చేసినా హెల్త్ టిప్స్ చాలా చూస్తుంటాం. కానీ పాటించేందుకు టైమ్, మనీ.. ఈ రెండూ కుదిరినా ఆ టిప్ మనకు సహించకపోవడం.. ఇలా సిటీ లైఫ్ లో ఉన్నవాళ్ల సమస్యలు వేరు.
ముఖ్యంగా తీసుకున్న ఆహారం ఒంటికి పట్టడమే అసలు సమస్య. డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా పద్ధతి లేకుండా మెడిసిన్ వాడకం.. ఫుడ్ అలవాట్ల కారణంగా జీర్ణాశయ సమస్యలు ఈ రోజుల్లో ఎక్కువయ్యాయి. అందుకే గట్ హెల్త.. గట్ హెల్త్ అని ఈ మధ్య డాక్టర్లు, శాస్త్రవేత్తలు మొత్తుకుంటున్నారు. గట్ హెల్త్ బాగుంటేనే తిన్న తిండి ఒంటికి పడుతుంది. చాలా ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటుంది. అలాంటి గట్ హెల్త్ తో పాటు డాక్టర్స్ కూడా చెప్పని రహస్యాలు.. మెడిసిన్స్ కూడా చేయని మేలు కిస్మిస్ చేస్తుంది. ముఖ్యంగా కిస్మిస్ ను రాత్రి నానబెట్టి పరగడుపునే ఆ వాటర్ తీసుకుంటే.. అలాగే నానిన ఆ కిస్మిస్ కూడా తింటే బోలెడు లాభాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
కడుపులో ఉన్న సమస్యలు తొలగిపోతాయి:
దీర్ఘకాలిక మలబద్ధకం, ఎసిడిటీ, అయాసము మొదలైన సమస్యలు కిస్మిస్ వాటర్ తో ఇట్టే తగ్గిపోతాయి. రెగ్యులర్ గా ఈ వాటర్ తాగటం వలన ఈ సమ్యలకు చెక్ పెట్టవచ్చు.
Also Read :- ఉగాది పచ్చడి మహాఔషధం.. ఎన్ని రోజులు తినాలి
కొలెస్ట్రాల్ను కంట్రోల్ చేయవచ్చు:
రెగ్యులర్ గా రైజిన్ (కిస్మిస్) వాటర్ తాగటం వలన కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రోల్ చేయవచ్చు. అంతేకాకుండా ట్రై గ్లిజరాల్స్ ను కూడా అదుపులో ఉంచవచ్చు. ట్రై గ్లిజరాల్స్ కంట్రోల్ అయిత గుండె సంబధిత జబ్బులు నయం అవుతాయి.
యవ్వనంగా కనిపించవచ్చు:
క్రమం తప్పకుండా కిస్మిస్ వాటర్ తాగడం వలన స్కిన్ గ్లో పెరుగుతుంది. చర్మం జీవక్రియ (మెటబాలిజం) పెరగటంత మరింత యవ్వనంగా కనిపిస్తారు.
రక్తం పెరుగుతుంది:
రెగ్యులర్ గా ఎండు ద్రాక్ష వాటర్ తో పాటు నానిన కిస్మిస్ తినటం వలన బాడీలో బ్లడ్ లెవల్స్ పెరుగుతాయి. హిమోగ్లోబిన్ పెరగటం వలన రక్తం వృద్ధి అవుతుంది.
జ్వరం చిటికెలో తగ్గుతుంది:
జ్వరం వచ్చినట్లు అనిపిస్తే ఉదయం ఈ వాటర్ తాగటం వలన వెంటనే ఫీవర్ తగ్గుతుంది.
కిస్మిస్ వాటర్ ఎలా తయారు చేసుకోవాలి..?
కిస్మిస్ వాటర్ తయారు చేసుకునేందుకు ముందుగా బౌల్ లో కొన్ని కిస్మిస్ తీసుకుని వాటర్ లో 20 నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ లో వేసి రాత్రంతా నానబెట్టాలి. కిస్మిస్ వాటర్ రెడీ అయినట్లే.