పైపు పగిలి రోడ్డు పాలవుతున్న మంచి నీళ్లు

పైపు పగిలి రోడ్డు పాలవుతున్న మంచి నీళ్లు
  • అవస్థలు పడుతున్న స్థానికులు
  • పట్టించుకోని అధికారులు 

రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని పిరన్ చెరువు గ్రామం గంధం గూడలో పైపు పగిలి మంచి నీరు రోడ్డు మీద పారుతోంది. దీంతో ఆ ప్రాంతమంతా బురదమయంగా మారింది. గంధంగూడ ప్రధాన రహదారిపై అధికారులు సిసి రోడ్లు వేస్తున్నారు. వారం కిందట పనులు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా జేసీబితో రోడ్డును చదును చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంచి నీటి పైపు పగిలి నీరంతా రోడ్డు మీదకు వస్తోంది. దీంతో ఆ ప్రాంతమంతా బురదగా మారి నడవడానికి కూడా ఇబ్బందిగా ఉందని స్థానికులు వాపోతున్నారు. ఓ వైపు మంచి నీరు దొరకక మైళ్ల దూరం వెళ్తూ అవస్థలు పడుతుంటే మంచి నీళ్లంతా రోడ్డు మీద వృధాగా పోతోందని కాలనీవాసులు వాపోతున్నారు. ఈ విషయమై కాంట్రాక్టర్, ప్రజా ప్రతినిధులు, అధికారులను సంప్రదించినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని వారు చెబుతున్నారు.  ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యని పరిష్కరించాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి..

నెలరోజుల్లో హైకోర్టుకు కొత్త జడ్జిలు

దేశంలో ఒకే మతం, ఒకే భాష ఉండాల్నా?