ఎండ తీవ్రతను తట్టుకోలేక అల్లాడుతున్న అడవి జంతువులకు ఫారెస్ట్ ఆఫీసర్లు ట్యాంకర్లతో వాటర్ అందిస్తున్నారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల ఫారెస్ట్ లో నీటి తావుల వద్ద సేదతీరుతున్న అడవి జంతువుల ఫొటోలను పలిమెల ఎఫ్ఆర్ వో వెంకటేశ్వరరావు రిలీజ్ చేశారు.
ట్యాంకర్లతో సాసర్ పిట్స్ ను నింపుతున్నట్లు తెలిపారు. రేంజ్ లోని చెక్ డ్యాం ల వద్ద నీరు నిల్వ ఉండే విధంగా కాలువలను శుభ్రం చేసి చర్యలు తీసుకున్నామన్నారు.