గ్రామాల్లో తాగునీటి ...కొరత లేకుండా చూడాలి :ఎమ్మెల్యే బాలు నాయక్

కొండమల్లేపల్లి (చింతపల్లి), వెలుగు: వేసవి సమీపిస్తుండడంతో గ్రామాల్లో నీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నేనావత్  బాలునాయక్ ఆదేశించారు. మంగళవారం ఎంపీడీవో ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాగునీటి సమస్య ఉన్న గ్రామాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ నెల చివరి వరకు రైతు భరోసా డబ్బులు పూర్తిస్థాయిలో రైతుల అకౌంట్లలో పడతాయని చెప్పారు. సర్పంచులకు ఇవ్వాల్సిన పెండింగ్‌‌‌‌‌‌‌‌ బిల్లుల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాన హామీ ఇచ్చారు. సర్పంచ్‌‌‌‌‌‌‌‌ల పదవి కాలం ముగియనుండడంతో స్పెషల్ ఆఫీసర్ల కార్యచరణ సిద్ధం చేయాలని సూచించారు.