నిత్యం గుక్కెడు నీటి కోసం గ్రేటర్ వాసులు గోసపడుతున్నారు. ఏ పూటకు ఆ పూట నీళ్లు తెచ్చుకుంటూ.. కాలం వెళ్లదీస్తున్న దుస్థితి నెలకొంది. అయితే రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ జలమండలి అధికారుల నిర్లక్ష్యంతో మంచినీరు వృధాగా పోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. రాజేంద్ర నగర్ లోని గోల్డెన్ హైట్స్ జన చైతన్య నుంచి కొన్ని నెలలుగా మంచినీరు ఈసీ కాలువలో నీరంతా మురికి నీటిలో కలసి పోతుంది. బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ PNT కాలనీకి ఈ వాటర్ సప్లై అవుతుంది.
Also Read : అన్నదాతే కాదు.. ప్రాణదాత కూడా: 61 ఏళ్ల రైతు.. కిడ్నీలు, లివర్, కళ్లు దానం
గతంలో బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, అటు జల మండలి అధికారులకు చీమకుట్టినట్టు కూడా ఉండటం లేదు. ఓవైపు జనం మంచినీరు లేక నిత్యం అల్లాడుతున్నా.. మరోవైపు అధికారుల నిర్లక్ష్యంతో లీటర్లుకు లీటర్ల నీళ్లు వృథాగా పోతుంది. ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి.. నీటి వృధాకు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.