తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి:ఎమ్మెల్యే బాలూనాయక్

తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి:ఎమ్మెల్యే బాలూనాయక్

దేవరకొండ, వెలుగు : వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి ఎమ్మెల్యే బాలూనాయక్ అధికారులకు సూచించారు. గురువారం దేవరకొండ ఆర్డీవో కార్యాలయంలో తాగునీరు, ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్, ఆర్ అండ్ ఆర్ భూసేకరణ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏప్రిల్, మే నెలల్లో తాగునీటి సమస్య వచ్చే అవకాశాలు ఉన్నందున, గ్రామాల్లో పాత బోర్ల రిపేరు, అద్దె బోర్లను వినియోగించి ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల జాబితాను పరిశీలించి అర్హులకు మాత్రమే వచ్చేలా చూడాలని చెప్పారు.

నక్కలగండి తండాలో ఇండ్లు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలన్నారు. భూ నిర్వాసితులకు ఆర్​అండ్​ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని అధికారులకు సూచించారు. అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజల డిమాండ్ మేరకు తాగునీటిని సరఫరా చేయాలన్నారు. ఎక్కడైనా తాగునీటి సమస్య ఏర్పడితే ప్రత్యామ్నాయ మార్గాలను అణ్వేషించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ జె.శ్రీనివాస్, దేవరకొండ అడిషనల్ ఎస్పీ మౌనిక, ఆర్డీవో శ్రీదేవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.