
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఎండల తీవ్రతతో భూగర్భజలాలు అడుగంటి బోర్లు వట్టి పోతున్నాయి. ఆశోక్నగర్, స్నేహపూరి కాలనీ, ఎన్జీవోస్కాలనీ, కాకతీయనగర్, శ్రీరాంనగర్, వివేకానంద కాలనీ తదితర ఏరియాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడింది. నల్లాల ద్వారా నీటి సప్లయ్ వారానికి ఒకటి, రెండు రోజులు మాత్రమే వస్తున్నాయి. ట్యాంకర్ల నీటి కోసం ప్రజలు వెయిట్ చేయాల్సి వస్తోంది.