హైదరాబాద్ లో 20 వేల లీటర్ల వరకు ఫ్రీగా డ్రింకింగ్ వాటర్

 హైదరాబాద్ లో 20 వేల లీటర్ల వరకు ఫ్రీగా డ్రింకింగ్ వాటర్

హైద‌రాబాద్ : జనవరి ఫస్ట్ వీక్ నుంచి హైదరాబాద్ లో ఫ్రీగా డ్రింకింగ్ వాటర్ సప్లై చేయనున్నట్లు తెలిపారు మంత్రి కేటీఆర్. ఉచిత తాగునీరు పంపిణీపై మంత్రి కేటీఆర్ శ‌నివారం స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌, జ‌ల‌మండ‌లి ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు జ‌ల‌మండ‌లి ద్వారా 20 వేల లీట‌ర్ల వ‌ర‌కు తాగునీరు ఉచితంగా ఇస్తామ‌ని తెలిపారు.  సీఎం న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన మాట మేర‌కు డిసెంబ‌ర్ నెల తాగునీటి వినియోగం 20 వేల లీట‌ర్ల వ‌ర‌కు ఉచితమన్నారు. ఈ మేర‌కు జ‌న‌వ‌రి నెల‌లో వినియోగ‌దారుల‌కు వ‌చ్చే డిసెంబ‌ర్ నెల బిల్లులో 20 వేల లీట‌ర్ల వ‌ర‌కు ఛార్జ్ చేయొద్ద‌ని అధికారుల‌కు సూచించారు కేటీఆర్.