ఏపీలో భారీ చోరీ జరిగింది.. బంగారం డెలివరీకి వెళ్లే క్రమంలో రూ. 5 కోట్లతో డ్రైవర్ పరారైన ఘటన నందిగామలో చోటు చేసుకుంది. ఆదివారం ( జనవరి 12, 2025 ) చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్ నుంచి విజయవాడ కు బంగారం డెలివరీకి తీసుకెళ్తుండగా.. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న క్రమంలో జగ్గయ్యపేట సమీపంలో ఫుడ్ ప్లాజా వద్ద టీ కోసం కారు ఆపారు.
ఈ క్రమంలో కారులో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొస్తానని తోటివారిని ఏమార్చిన డ్రైవర్.. కారు లో ఉన్న గోల్డ్ తో పరా అయ్యాడు. అయితే.. కారుకు జిపియస్ ట్రాకర్ ఉండటంతో నందిగామ వద్ద కారు వదిలేసి సెల్ స్విచ్ ఆఫ్ చేసుకొని పరారయ్యాడు డ్రైవర్. రూ. 5 కోట్ల విలువైన బంగారం రెప్పపాటులో మాయమవ్వడంతో అవాక్కయిన బాధితుడు నందిగామ ఏసీపి ఆఫీసులో ఫిర్యాదు చేశాడు.
బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.. 6 ప్రత్యేక టీంలతో ఏర్పాటు చేసి పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నారు పోలీసులు.