ముంబై: అసలే డ్రగ్స్ మత్తులో ఉన్నడు. దానికి తోడు కారును డ్రైవ్ చేసుకుంటూ రోడ్డెక్కిండు. ఇది తెలియక ఓ కానిస్టేబుల్ అతడిని అడ్డుకోబోయిండు. నన్ను అడ్డుకుంటవా అని.. కానిస్టేబుల్‌పైకి ఎక్కించబోయిండు. జరంతలో మిస్ అయి కానిస్టేబుల్ కారు టాప్ పైన పడి గట్టిగా పట్టుకున్నాడు. పోలీసాయన ఎంత మొత్తుకున్నా.. ఇతగాడు ఆపితేనా.. పది కిలోమీటర్లు కారుని దౌడుతీయించిండు. వెంబడించిన పోలీసులు.. ఎట్టకేలకు కారును ఆపారు. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా అయింది కానిస్టేబుల్ పరిస్థితి.
మహారాష్ట్రలోని వాషి సిటీలో జరిగిందీ ఘటన. ఆదిత్య బెంబడే అనే వ్యక్తి.. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో డ్రగ్స్ తీసుకుని కారుతో రోడ్డెక్కాడు. కారు అనుమానాస్పదంగా కనిపించడంతో ట్రాఫిక్ పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా.. మత్తులో అడ్డదిడ్డంగా నడిపాడు. కారుపై పడ్డ కానిస్టేబుల్ సిద్ధేశ్వర్ మాలి.. అట్లనే విండ్ స్క్రీన్ ను పట్టుకుని పడుకున్నారు. ఇంకో కారులో వెంబడించిన పోలీసులు.. సిటీలోని ఉరన్ నాకా దగ్గర ఆదిత్యను అడ్డుకున్నారు. అతడిని అరెస్టు చేసి, హత్యాయత్నం కేసు నమోదు చేశారు.