
తిరుమలలో దారుణం జరిగింది.. పార్కింగ్ విషయంలో డ్రైవర్ల మధ్య మొదలైన గొడవ ఓ డ్రైవర్ మరణానికి కారణమయ్యింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. 3 రోజుల క్రితం పోలీస్ కాంప్లెక్స్ దగ్గర పార్కింగ్ విషయంలో డ్రైవర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో కురబలకోటకు చెందిన శివ అనే డ్రైవర్ పై ముగ్గురు డ్రైవర్లు దాడి చేశారు.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ శివ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ( ఏప్రిల్ 15 ) మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శివతో గొడవపడ్డ ముగ్గురు డ్రైవర్లు తిరుపతి చెందినవారని తెలుస్తోంది. డ్రైవర్ శివ మృతితో అతని కుటంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.