కండక్టరే గనక గమనించి ఉండకపోయినా..చాకచక్యంగా స్పందించకపోయినా..బస్సులో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసేవి.. ఆర్టీసీ బస్సు డ్రైవర్ గుండె పోటుతో కుప్పకూలితే..కండక్టర్ డ్రైవింగ్ సీట్లోకి దూకి బస్సును కంట్రోల్ చేసి ప్రయాణికుల ప్రాణాలు నిలబెట్టిన సంఘటన బెంగళూరులో జరిగింది.
బెంగళూరులో నేలమంగళ నుంచి దసనాపుర వెళ్తున్న ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో సీటు మీదే ప్రాణాలు విడిచాడు డ్రైవర్ కిరణ్ కుమార్. బస్సు రన్నింగ్ లో ఉండగా కిరణ్ కుమార్ కు ఆకస్మాత్తుగా గుండెపోటు రావడం కుప్పకూలిపోవడం గమనించిన కండక్టర్ ఓబలేష్..డ్రైవింగ్ సీటులో దూకి బస్సును కంట్రోల్ చేశాడు.. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్సులో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలోడ్రైవర్ గుండెపోటుకు గురైన దృశ్యాలు రికార్డయ్యాయి.
ఆర్టీసీ బస్సు డ్రైవర్ గుండె పోటుతో కుప్పకూలితే..కండక్టర్ డ్రైవింగ్ సీట్లోకి దూకి బస్సును కంట్రోల్ చేసి ప్రయాణికుల ప్రాణాలు నిలబెట్టిన సంఘటన బెంగళూరులో జరిగింది. pic.twitter.com/EVeoKpASvw
— దివిటి ఛానల్ (@risingsun143) November 6, 2024
బస్సు డ్రైవర్ కిరణ్ కుమార్ గుండెపోటులో మరణించడం అందరికి బాధకలిగింది. అతని కుటుంబ సభ్యులకు నెటిజన్లు సంతాపం తెలిపారు. అదే సమయంలో కండక్టర్ సమయస్పూర్తిగా నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. కండక్టర్ ఒబలేష్ లేకుండా బస్సులో ఉన్న ప్రయాణికుల పరిస్థితి మరో విధంగా ఉండేది. ఒబలేష్ చాకచక్యంగా వ్యవహరించడం వల్లే ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారని ప్రశంసిస్తున్నారు.