
ముత్తారం, వెలుగు: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రంలోని సరస్వతీ స్కూల్సమీపంలో నీళ్ల ట్యాంకర్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం మండలకేంద్రానికి చెందిన శ్రీనివాస్ (34) ట్రాక్టర్ డ్రైవర్. కొత్తగా నిర్మించిన సీసీ రోడ్లపై చల్లేందుకు శనివారం ట్యాంకర్లో నీటిని తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో ట్యాంకర్ అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో అతనికి తీవ్రగాయాలు కావడంతో శ్రీనివాస్ స్పాట్లోనే చనిపోయాడు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ మధుసూదన్ రావు పరిశీలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.