
గండిపేట, వెలుగు: సిటీకి చెందిన క్యాబ్డ్రైవర్మంచితనాన్ని చాటుకున్నాడు. ఓ ప్యాసింజర్క్యాబ్లో మరిచిపోయిన నాలుగున్నర తులాల బంగారు నెక్లెస్ఉన్న బ్యాగ్‌ను తిరిగి అప్పగించాడు. అత్తాపూర్ జలాల్‌బాబానగర్‌కు చెందిన షమీనాబేగం(27) బాలానగర్ నుంచి ఉబర్ క్యాబ్‌లో శనివారం 1.30 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి జలాల్‌బాబానగర్‌కు వచ్చింది.
అయితే నాలుగున్నర తులాల బంగారు నెక్లెస్ ఉన్న హ్యాండ్ బ్యాగ్‌ను క్యాబ్‌లో మరచిపోయింది. కొద్దిసేపటి తర్వాత గుర్తించిన క్యాబ్డ్రైవర్మైపాల్ ఆ బ్యాగ్‌ను అత్తాపూర్ పోలీసులకు అందజేశాడు. ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు షమీనాబేగంను పిలిపించి బ్యాగ్‌ను అందజేశారు.