
పండుగ ఏదైనా సరే.. ప్రతి తెలుగింట్లో వడ(గారె)లు నూనెలో పొంగాల్సిందే. తెలుగిళ్లలో అంతటి ఇంపార్టెన్స్ ఉన్న వడలను చాలామంది సరైన ఆకారంలో చేయలేకపోతుంటారు. అలాంటి వాళ్ల కోసమే ఈ వడ మేకర్. దీన్ని డ్రిక్స్టీ కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చింది.
మన్నికైన స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేసిన ఈ మేకర్‌తో చాలా ఈజీగా, పర్ఫెక్ట్ షేప్‌లో వడలు చేసుకోవచ్చు. దీంతో డోనట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. మేకర్లో పిండి పెట్టి తర్వాత దాన్ని కడాయిపై పెట్టి పై భాగంలో ఉండే ఇనుప లివర్ని కిందికి నొక్కితే సరిపోతుంది. కడాయిలో వడ పడిపోతుంది. ధర : 299