ఏపీలో డీఆర్‌వో నిర్వాకం: రివ్యూ మీటింగ్ లో ఆన్లైన్ రమ్మీ గేమ్ ఆడుతూ బిజీ

ఏపీలో డీఆర్‌వో నిర్వాకం:  రివ్యూ మీటింగ్ లో ఆన్లైన్ రమ్మీ గేమ్ ఆడుతూ బిజీ

చేస్తుందేమో బాధ్యత గల రెవెన్యూ అధికారి ఉద్యోగం పైగా కలెక్టరేట్ లో రివ్యూ మీటింగ్.. ఎంతో బాధ్యతగా ఉండాల్సింది పోయి ఏపీలో ఓ డీఆర్వో రివ్యూ మీటింగ్ లో ఆన్ లైన్ రమ్మీ గేమ్ ఆడుతూ కనిపించాడు. మంగళవారం ( జనవరి 21, 2025 ) అనంతపురంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది... ఈ సమావేశానికి కలెక్టర్లు, జిల్లా పోలీసు యంత్రంగంతో పాటు పలువురు అధికారులు కూడా పాల్గొన్నారు.

Also Read :- రైలును ఆపేసి పట్టాలపై ప్రయాణికుల ఆందోళన

ఈ సమావేశానికి హాజరైన అనంతపురం డీఆర్‌వో మలోలా రివ్యూ మీటింగ్ ని పట్టించుకోకుండా మొబైల్ లో బిజీగా కనిపించరు.. రెవెన్యూ అధికారి కదా ఎదో ఇంపార్టెంట్ పనిలో బిజీగా ఉండుంటారులే అనుకుంటే మన పొరపాటే అవుతుంది.. ఒక పక్క కీలక రివ్యూ మీటింగ్ జరుగుతుంటే ఈయన గారు తీరిగ్గా ఆన్ లైన్ రమ్మీ ఆడుకుంటూ కూర్చున్నారు. ఇందుకు సంబందించిన నెట్టింట వైరల్ అవ్వగా.. డీఆర్వో మలోలాపై కామెంట్ల రూపంలో దుమ్మెత్తి పోస్తున్నారు నెటిజన్స్. 

ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న  జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కీలక సమావేశంలో ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడుతున్న డీఆర్వో మలోలపై విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై వివరణ కోరుతూ డీఆర్వోకు నోటీసులు జారీ చేశారు కలెక్టర్. ఇలాంటి ఘటనలు సహించబోనని హెచ్చరించారు కలెక్టర్.