టెల్ అవీవ్: హమాస్ చీఫ్ యహ్యా సిన్వార్(62) మృతితో మరోసారి పశ్చిమాసియాలో ఉద్రిక్తలు నెలకొన్నాయి. ఐడీఎఫ్ దళాలు హమాస్ చీఫ్ యహ్యా సిన్వార్‌ను మట్టుబెట్టడంతో ఎలాగైనా ఇజ్రాయెల్‌పై రివేంజ్ తీర్చుకోవాలని హమాస్ పగతో రగిలిపోతుంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై ఇంటిపై దాడి జరగడం సంచలనంగా మారింది. సిజేరియాలోని బెంజమిన్ నెతన్యాహు నివాసంపై డ్రోన్ ఎటాక్ జరిగినట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికారులు దృవీకరించారు. ఈ ఘటనలో ప్రధానికి ఎలాంటి ప్రమాదం జరగలేదని, ఆయన సేఫ్‌గా ఉన్నారని తెలిపింది. ‘‘లెబనాన్ నుండి ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నివాసం వైపు డ్రోన్ ప్రయోగించబడింది. ఇజ్రాయెల్ ఉన్నత స్థాయి ఎయిర్ సెక్యూరిటీని దాటి డ్రోన్ ప్రధాని ఇంటిని టార్గెట్ చేసింది.
ALSO READ : గాజాలోని జబాలియా శిబిరంపై ఇజ్రాయెల్ దాడి..33 మంది మృతి
ఈ సంఘటన సమయంలో నెతన్యాహు, ఆయన సతీమణి, కుటుంబ సభ్యులు ఇంట్లో లేరు. ఈ డ్రోన్ ప్రమాదం వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు’’ అని ఇజ్రాయెల్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. శత్రుదుర్బేద్యమైన ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థను దాటి ప్రధాని నివాసంపై డ్రోన్ దాడి జరగడంతో ఇజ్రాయెల్ దళాలు ఉలిక్కిపడ్డాయి. ఈ ఘటనతో వెంటనే అప్రమత్తమన సెక్యూరిటీ ఫోర్సెస్.. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్ ఫోర్స్ వ్యవస్థ కలిగిన ఇజ్రాయెల్‌పై శత్రు దేశాలు ఏకంగా ప్రధాని ఇంటిని టార్గెట్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రధాని ఇంటిపై జరిగిన డ్రోన్ ఎటాక్‌పై హమాస్, హిబ్బొల్లా ఎలాంటి ప్రకటన చేయలేదు.