మావోయిస్ట్ ఏరియాలోని గిరిజన గ్రామాలపై డ్రోన్ బాంబుల వర్షం కలకలం రేపింది. ఛతీష్‌గడ్ లోని సుక్మా జిల్లాలో గిరిజన గ్రామాల్లోని పంటపొలాల్లో డ్రోన్ బాంబుల దాడులు జరిగాయి. సుక్మా జిల్లాలోని సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ సమీపంలోని గ్రామాల్లోని పంట పొలాల్లో డ్రోన్ బాంబుల శకలాలు కనిపించాయి. పోలీసులు డ్రోన్ బాంబులతో గిరిజన గ్రామాలను టార్గెట్ చేస్తున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టేకులగూడ, జాగురుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండపల్లి, గుండం పువర్తి, బత్తి గూడ గిరిజన గ్రామాలపై పోలీసులు నిత్యం డ్రోన్ దాడులు నిర్వహిస్తున్నారని ఆయా గిరిజన తెగలు ఆరోపిస్తున్నారు. మావోయిస్టులను అంతం చేయడానికే ఇలా డ్రోన్ దాడులు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల మవోయిస్ట్ ఏరియాలో భారీ ఎన్ కౌంటర్లు జరుగుతున్న విషయం తెలిసిందే.