ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది. ఎన్నికలకు పదిరోజుల సమయం కూడా లేకపోవటంతో నేతలంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో మునిగిపోయారు. ఈసారి ఎన్నికలను అధికార ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రమంలో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ క్రమంలో అనకాపల్లిలో చోటు చేసుకున్న ఘటన రాష్ట్రంలో నెలకొన్న పొలిటికల్ హీట్ కీ నిదర్శనంగా చెప్పచ్చు. వైసీపీ ఎంపీ అభ్యర్థి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు ఇంటి వద్ద రెక్కీ నిర్వహించటం స్థానికంగా కలకలం రేపింది.
ముత్యాల నాయుడు ఇంటివద్ద పెద్ద డ్రోన్స్ తో రెక్కీ నిర్వహిస్తున్న వారిని స్థానికులు అడ్డుకొని అనుమానితులను పోలీసులకు అప్పగించారు. ఇది బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అనుచరుల పని అని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.మరి, స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనకు కారణాలేంటో తెలియాలంటే వేచి చూడాలి.