మనసుంటే మార్గముంటుందన్న నీతి సూక్తిని ఓ సర్పంచ్ పాటించి చూపించారు. పుట్టుకతోనే వికలాంగుడైన ఓ వ్యక్తికి గ్రామ సర్పంచ్ డ్రోన్ ద్వారా పెన్షన్ డబ్బులు పంపించి, తన దయా హృదయాన్ని చాటుకున్నారు. ఒడిశాలోని నువాపాడా జిల్లాలోని మారుమూల గ్రామంలో నివసిస్తున్న హెతారం సత్నామీ అనే వికలాంగుడు ప్రభుత్వ పింఛను కోసం ప్రతి నెలా దట్టమైన అడవిలో గుండా 2 కి.మీ. ప్రయాణించాల్సి వచ్చేది. అయితే అతని బాధను అర్థం చేసుకున్న భలేశ్వర్ పంచాయతీ పరిధిలోని భుత్కపాడు గ్రామ సర్పంచ్ సరోజ్ అగర్వాల్... ఆన్ లైన్ లో డ్రోన్ ను కొనుగోలు చేశారు. ఇతర దేశాలలో డ్రోన్ల ద్వారా వస్తువులు ఎలా పంపుతున్నారో తెలుసుకొని మరీ..హెతారం ఇంటి వద్దకే పెన్షన్ డబ్బును డెలివరీ చేశారు. అయితే పంచాయితీ దగ్గర అంత మొత్తంలో నిధులు లేనందున, సరోజ్ అగర్వాలే తన సొంత డబ్బుతో డ్రోన్ కొని, డబ్బు పంపించారని బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ (బీడీఓ) సుబదార్ ప్రధాన్ తెలిపారు. మందులు, కిరాణా సామాగ్రి, ఆహారంతో సహా వివిధ వస్తువులను డెలివరీ చేయడంలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే డ్రోన్ ద్వారా డబ్బును డెలివరీ చేయడం భారతదేశంలోనే ఇది మొదటిసారి కావడం విశేషం.
డ్రోన్ ద్వారా వికలాంగుడికి పెన్షన్ పంపించిన సర్పంచ్
- దేశం
- February 20, 2023
మరిన్ని వార్తలు
-
పీఎస్ఎల్వీ సీ-60 రాకెట్ ప్రయోగం సక్సెస్.. శ్రీహరికోటలో శాస్త్రవేత్తల సంబరాలు
-
New Rules From 1st January 2025: బాబోయ్.. 2025, జనవరి 1 నుంచి ఇన్ని రూల్స్ మారబోతున్నాయా..?
-
నా లవర్నే బ్లాక్మెయిల్ చేస్తావా.. బెస్ట్ ఫ్రెండ్‌ని సుత్తితో కొట్టి చంపిన మైనర్..
-
వీళ్లసలు మనుషులేనా.. ఈ ఘటన చూస్తే ఆ డౌట్ రావడం పక్కా.. పాపం.. అన్యాయంగా చంపేశారు..!
లేటెస్ట్
- పీఎస్ఎల్వీ సీ-60 రాకెట్ ప్రయోగం సక్సెస్.. శ్రీహరికోటలో శాస్త్రవేత్తల సంబరాలు
- బంగారం ధరలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలివే..
- ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు ఎప్పుడో తెలుసా.. ఎంత ఉండొచ్చంటే..
- వైన్స్‌లో అన్ని మందు బాటిల్స్ చూసేసరికి నోరు లబలబలాడింది.. దొంగ దొరికిపోయిండు..!
- పారాలింపిక్స్ విజేతను అభినందించిన చిరంజీవి
- విషమంగానే శ్రీతేజ్ పరిస్థితి.. రెండు రోజుల నుంచి మళ్లీ వెంటిలేటర్ పైనే..
- ఫేక్ న్యూస్‌కు చెక్ పెట్టేందుకు వాట్సాప్ కొత్త ఫీచర్.. ఎలా వాడాలి?
- హైదరాబాద్‌లో న్యూ ఇయర్.. డిసెంబర్ 31 రాత్రి 500 క్యాబ్స్, 250 బైక్ ట్యాక్సీల్లో ఫ్రీ జర్నీ ఫెసిలిటీ..!
- రోహిత్‌కు బ్యాడ్ టైమే గానీ.. బుమ్రాకు లక్కు బానే కలిసొచ్చింది.. అవార్డుకు నామినేట్ అయ్యాడు
- New Rules From 1st January 2025: బాబోయ్.. 2025, జనవరి 1 నుంచి ఇన్ని రూల్స్ మారబోతున్నాయా..?
Most Read News
- రైతు భరోసాకు ఆన్లైన్ అప్లికేషన్లు!
- జనవరి 1 నుంచి భిక్షాటన బంద్ .. నియంత్రణకు పోలీసులతో ప్రత్యేక టీమ్ లు
- వరంగల్‌లో 45 ప్లాట్లు .. గజం రూ.75 వేలు
- గేమ్ ఛేంజర్ ఈవెంట్ కి సీఎం రేవంత్ రెడ్డి ఛీఫ్ గెస్ట్..?
- హిందీ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న పుష్ప రాజ్.. 25 రోజుల్లో రూ.770 కోట్లు..
- రియల్ ఎస్టేట్ వాపు అభివృద్ధి కాదు
- సోమావతి అమావాస్య రోజున ..ఇలా చేయండి... పాపాలు పోతాయి
- కుంభమేళా 2025: సికింద్రాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్ ..IRCTC 8 రోజుల టూర్.. ప్యాకేజీ వివరాలు ఇవే
- New Rules From 1st January 2025: బాబోయ్.. 2025, జనవరి 1 నుంచి ఇన్ని రూల్స్ మారబోతున్నాయా..?
- IND vs AUS: కింగ్ చచ్చిపోయాడు.. కోహ్లీ ఔటవ్వడంపై ఆసీస్ మాజీ జుగుప్సాకర వ్యాఖ్యలు