ఖమ్మం సిటీలోని ట్యాంక్​బండ్‌‌‌‌‌‌‌‌పై డ్రోన్ ​షో అదుర్స్

ఖమ్మం సిటీలోని ట్యాంక్​బండ్‌‌‌‌‌‌‌‌పై శుక్రవారం సాయంత్రం నిర్వహించిన మెగా డ్రోన్ షో ఆకట్టుకుంది. 400 డ్రోన్లతో చేసిన ప్రదర్శన ఆద్యంతం అలరించింది. ఎన్టీఆర్ గార్డెన్స్ చుట్టూ దాదాపు10 వేల మంది కేరింతలు కొడుతూ డ్రోన్​షోను వీక్షించారు. సింగర్లు పాటలతో హోరెత్తించారు.

మంత్రి పువ్వాడ అజయ్​కుమార్, కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు.ఎస్.వారియర్ పాల్గొన్నారు. వందల డ్రోన్లు గాల్లో ఎగురుతూ సీఎం కేసీఆర్, మాజీ సీఎం ఎన్టీఆర్, మంత్రి పువ్వాడ అజయ్, బౌద్ధ స్థూపం, ఖమ్మం ఖిల్లా, లకారం తీగల వంతెనకు రూపమిచ్చాయి.