ట్యాంక్ బండ్ పై ఆకట్టుకున్న డ్రోన్ షో: సందడిగా ఎన్టీఆర్ మార్గ్ ,సచివాలయం పరిసరాలు

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైన సందర్బంగా ప్రజా విజయోత్సవాలు ఘనంగా నిర్వహించింది రేవంత్ సర్కార్.ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఇవాళ ( డిసెంబర్ 9, 2024 ) సచివాలయం దగ్గర తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అనంతరం నిర్వహించిన భారీ డ్రోన్ షో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సోమవారం సాయంత్రం 7 :30 గంటల కి ప్రారంభం అయిన ఈ డ్రోన్ షో సందర్శకులను ఆకట్టుకుంది. డ్రోన్ షోతో పాటు భారీ బాణసంచాతో సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ కార్యక్రమం కోసం ట్యాంక్ బండ్ , సెక్రేరియట్ నుండి హెచ్ ఏం డి ఏ గ్రౌండ్స్ వరకు భారీ గా ఏర్పాట్లు చేశారు.హుస్సేన్  సాగర్ చుట్టూ    రంగు రంగుల  విద్యుత్ దీపాల అలంకరణ ఆకట్టుకుంది. కళాకారుల తో సంప్రదాయ కళా న్యూత్యల ప్రదర్శనతో పాటు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ నేతృత్వంలో మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించారు. 

తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ, డ్రోన్ షో వెరసి ఎన్టీఆర్ మార్గ్ , సచివాలయం పరిసరాలు సందడిగా మారాయి. మూడు రోజుల పాటు జరిగిన ప్రజా పాలన విజయోత్సవాలు కు భారీగా తరలి వచ్చారు. డిసెంబర్ 7న మొదలైన ప్రజా విజయోత్సవాలు ఇవాళ ( డిసెంబర్ 9, 2024 ) నిర్వహించిన భారీ డ్రోన్ షోతో ముగిసాయి.