వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి.. విక్రమ్ ను రంగంలోకి దింపిన ఇండియన్ నేవీ

హిందూ మహాసముద్రంలో ఒక వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని రెండు సముద్ర ఏజెన్సీలు తెలిపాయి. లైబీరియా జెండాతో ఉన్న ఈ నౌక ఇజ్రాయెల్‌తో అనుబంధంగా ఉందని తెలుస్తోంది. సమాచారమందుకున్న భారత నేవీ.. వెంటనే ఐసీజీఎస్ విక్రమ్ ను రంగంలోకి దించి సహాయక చర్యలు చేపట్టింది. భారత్ లోని వెరావల్(గుజరాత్) తీరానికి నైరుతి దిశగా దాదాపు 200కి.మీ. దూరంలో ఊ ఘటన జరిగిందని ఆ ఏజెన్సీ వెల్లడించింది.

డ్రోన్ దాడి కారణంగా నౌకలోని రసాయన పదార్థాలున్న ట్యాంకర్ పేలి అగ్నిప్రమాదం జరిగినట్టు తెలిపింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ నౌకకు కొంచెం మేర నష్టం జరిగినట్టు సమాచారం. ఈ ఘటనపై ఇండియన్ నేవీ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనలో 20మంది భారతీయులు సహా సిబ్బంది అంతా సురక్షితంగా బయటపడినట్టు తెలిపింది.