ఉద్యాన పంటలకు డ్రోన్ టెక్నాలజీ అవసరం : హార్టికల్చర్​ యూనివర్సిటీ వీసీ దండా రాజిరెడ్డి

ఉద్యాన పంటలకు డ్రోన్ టెక్నాలజీ అవసరం : హార్టికల్చర్​ యూనివర్సిటీ వీసీ దండా రాజిరెడ్డి

ములుగు, వెలుగు: ఉద్యాన పంటల అభివృద్ధికి డ్రోన్ టెక్నాలజీ అవసరమని కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ చాన్స్​లర్ దండా రాజిరెడ్డి అన్నారు. ములుగులోని హార్టికల్చర్ యూనివర్సిటీలో సోమవారం డ్రోన్ సెంటర్ ఏర్పాటు, డ్రోన్ వినియోగం గురించి కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ.. ఉద్యాన పంటల్లో డ్రోన్​వినియోగాన్ని పెంపొందించడానికి కోరమాండల్​ కంపెనీతో ఒప్పందం చేసుకున్నామన్నారు.

పంటల పర్యవేక్షణ, తెగుళ్ల నియంత్రణ, పోషక నిర్వహణ కోసం డ్రోన్ వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడం ద్వారా ఉద్యాన రంగంలో సాంకేతికతను డెవలప్​చేయడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమన్నారు. డ్రోన్ టెక్నాలజీ ఉద్యాన రంగంలోని రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి, రామకృష్ణ, వినోద్, వర్సిటీ రిజిస్ట్రార్ భగవాన్, రాజశేఖర్, విజయ, శ్రీనివాసన్ పాల్గొన్నారు.