కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలు.. అదిరిపోయే త్రివేణి సంగమం డ్రోన్ వీడియో

కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలు.. అదిరిపోయే త్రివేణి సంగమం డ్రోన్ వీడియో

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం వద్ద గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం దగ్గర మే 15 నుంచి సరస్వతీ పుష్కరాలు ప్రారంభం కానున్నాయి.  మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మూడు నదులు కలిసే త్రివేణి సంగమం దృశ్యం  డ్రోన్ వీడియోను ప్రభుత్వం రిలీజ్ చేసింది. సరస్వతీ పుష్కరాల సందర్భంగా రెండు రోజుల క్రితం డ్రోన్ కెమెరాతో త్రివేణి సంగమం వీడియో, ఫొటోలను అధికారులు చిత్రీకరించారు అధికారులు. ఈ డ్రోన్ వీడియోలో మూడు నదులు కలిసే చోటు త్రివేణి సంగమం అద్భుతంగా కనిపిస్తుంది.  తెలంగాణ మీదుగా ప్రవహిస్తున్న గోదావరి, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా నుంచి వచ్చే ప్రాణహిత నదులు కలిసిన తరువాత అంతర్వాహినిగా సరస్వతి నది ఉద్భవిస్తుంది. 

 

Also Read : ప్రాణహిత చేవెళ్ల మేమే పూర్తి చేస్తాం

మే  15 నుంచి 26వ తేదీ వరకు 12 రోజుల పాటు పుష్కరాలు కొనసాగనున్నాయి.. పవిత్ర సరస్వతీ పుష్కర స్నానం చేసిన వారికి సమస్త పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.  రోజుకు 50 వేల నుంచి ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్ష మంది వరకు భక్తులు వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్తార‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ప్రభుత్వం అంచనావేస్తోంది.  అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తోంది . సుమారు రూ.35 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతోంది. అలాగే, పుష్కర ఘాట్​దగ్గర 17 అడుగుల రాతి స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్వతీ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. పుష్కరాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చే భక్తులకు టోల్ ఫ్రీ నంబ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ ఏర్పాటు చేయనున్నారు.  పుష్కరాల సమగ్ర వివరాలు వెబ్ సైట్, యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.