హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్‌లోని పలు మెడికల్ షాప్‌ల్లో మంగళవారం (అక్టోబర్ 29) సోదాలు చేశారు. ఈ సందర్భంగా నిబంధనలు పాటించకుండా మెడికల్ షాప్స్ నిర్వహణ సాగుతున్నట్లు అధికారులు గుర్తించారు.
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే పలువురు మెడికల్ షాప్ నిర్వాహకులు మందులు అమ్ముతున్నట్లు.. షాపులోని మెడిసిన్‌కి సంబంధించి డేటా మెయింటైన్ చేయట్లేదని డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. ఈ మేరకు గైడ్ లైన్స్ పాటించని కారణంగా 15 మెడికల్ షాప్స్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కచ్చితంగా వైద్యారోగ్య శాఖ రూల్స్ ఫాలో కావాలని ఈ సందర్భంగా మెడికల్ షాపు నిర్వాహకులను డ్రగ్ అధికారులు ఆదేశించారు.