హైదరాబాద్లో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు, తెలంగాణ ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్టెమెంట్ సంయుక్తంగా ఆస్పత్రులపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ నిల్వలను గుర్తించారు.
సికింద్రాబాద్ లోని రెజిమెంట్ బజార్ లోని జీవి సలూజా ఆస్పత్రిపై ఆకస్మిక దాడులు చేశారు. పెంటానిల్ ఇంజెక్షన్లు, కెటామైన్ ఇంజెక్షన్లు, పెంటాజోసిన్ ఇంజెక్షన్ల, మిడాజోలం వంటి నార్కోటిక్ డ్రగ్స్ , సైకోట్రోపిక్ పదార్థాల భారీ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.
మల్కాజిగిరిలోని మౌలాలికి చెందిన నేహా భగవత్ అక్రమంగా నార్కోటిక్ డ్రగ్‌లను సేకరించి తన నివాసంలో దాచిన నిల్వ లను గుర్తించారు. నార్కోటిక్ డ్రగ్‌లను నిల్వ చేయడానికి , విక్రయించడానికి లైసెన్స్‌లు లేని రాష్ట్రంలోని వివిధ సంస్థలకు సరఫరా చేసి దుర్వినియోగానికి దారితీసే అవకాశం ఉంది.
నేహా భగవత్ ఇంట్లో మార్ఫిన్ ఇంజెక్షన్లు, మార్ఫిన్ టాబ్లెట్లు, ఫెంటానిల్ ఇంజెక్షన్లు, ఫెంటానిల్ ప్యాచెస్, పెంటాజోసిన్ ఇంజెక్షన్లతో సహా భారీ నిల్వలు కూడా స్వాధీనం చేసుకున్నారు.