ఉప్పల్ లో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు.. రూ. 6 లక్షల మెడిసిన్స్ సీజ్..

ఉప్పల్ లో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు.. రూ. 6 లక్షల మెడిసిన్స్ సీజ్..

హైదరాబాద్ లోని ఉప్పల్ లో డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బుధవారం ( ఫిబ్రవరి 19, 2025 ) చేపట్టిన ఈ తనిఖీల్లో భారీగా మెడిసిన్స్ ను సీజ్ చేశారు అధికారులు. ఉప్పల్ లోని లక్ష్మీనారాయణ నగర్ కాలనిలో తనిఖీలు చేపట్టిన అధికారులు అక్రమంగా నిర్వహిస్తున్న గోడౌన్ ను గుర్తించారు. 

డ్రగ్ లైసెన్స్ లేకుండా గోడౌన్ నిర్వహిస్తున్నట్లు గుర్తించిన అధికారులు రూ. 6 లక్షల 70 వేలు విలువచేసే 6 రకాల యాంటీబయాటిక్స్ ను, ఇతర మెడిసిన్స్ ను సీజ్ చేసినట్లు తెలిపారు. గోడౌన్ నిర్వాహకుడు అద్దంకి వెంకటే సురేష్ బాబును అదుపులోకి తీసుకున్నారు అధికారులు.