తెలంగాణలో పలు చోట్ల డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లోని పలు మెడికల్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అధికారులు అక్రమంగా నిల్వ చేసిన డ్రగ్స్ ను సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో నిషేదిత డ్రగ్స్ కూడా సీజ్ చేసినట్లు తెలిపారు అధికారులు. పఠాన్ చెరులోని జెపి కాలనిలో ఓ మెడికల్ షాపులో లైసెన్స్ లేకుండా మెడిసిన్ నిల్వలు ఉన్నట్లు గుర్తించారు అధికారులు.
54 రకాల మెడిసిన్స్, యాంటీ బయోటిక్, స్టెరైడ్స్, యాంటీ డయాబెటిక్, యాంటీ హైపెరిటెన్సివ్ పలు రకాల మెడిసిన్స్ ను సీజ్ చేసినట్లు తెలిపారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. ఈ తనిఖీల్లో మొత్తం రూ.1.51లక్షలు విలువ చేసే డ్రగ్స్ ను సీజ్ చేసినట్లు తెలిపారు అధికారులు.
ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడలో అధిక రక్త పోటుకు చికిత్స అంటూ విక్రయిస్తున్న ఆయుర్వేదిక్ మెడిసిన్ సీజ్ చేశారు అధికారులు.
మెడిసిన్స్, అక్రమంగా నిల్వ ఉంచిన, లైసెన్స్ లేని మెడికల్ షాపుల నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు అధికారులు.