హైదరాబాద్ లో 20 మెడికల్​ షాపుల లైసెన్సులు సస్పెండ్

సికింద్రాబాద్, వెలుగు: గ్రేటర్​పరిధిలో మెడికల్​షాపుల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టారు. విజయపురి కాలనీలోని లక్ష్మీనరసింహ మెడికల్ షాపును రద్దు చేశారు. చాలా షాపుల్లో అక్రమంగా నిల్వ చేసి, ప్రిస్క్రిప్షన్​లేకుండా మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

20 మెడికల్​షాపుల లైసెన్సులను 15 నుంచి 60 రోజుల వరకు సస్పెండ్​చేసినట్లు డ్రగ్​ఇన్​స్పెక్టర్​ గోవింద్​తెలిపారు. ఆయా షాపుల్లో దగ్గు సిరప్​లు, నైట్రావెట్, అల్ప్రాజోలం, ట్రామాడోల్, టైడోల్ ట్యాబ్లెట్లను డాక్టర్లు ప్రిస్క్రిప్షన్​లేకుండానే విక్రయిస్తున్నారని చెప్పారు.

రూ.96 లక్షల డ్రగ్స్​ సీజ్​

శామీర్ పేట: మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాలోని ఓ గోదాంలో అక్రమంగా నిల్వ చేసిన రూ.96 లక్షల మందులను డ్రగ్ కంట్రోల్​అధికారులు పట్టుకున్నారు. మూడు చింతలపల్లిలోని ఓ గోదాంపై బుధవారం శామీర్ పేట ఎక్సైజ్ పోలీసులు, డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడిచేశారు. అక్కడ అక్రమంగా నిల్వచేసిన రూ.96 లక్షల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అశ్విన్ బయో ఫార్మా కంపెనీకి చెందిన డ్రగ్స్ అని, గోదాం కడారి సతీశ్​రెడ్డి అనే వ్యక్తి పేరున ఉన్నట్లు గుర్తించారు. సతీశ్​రెడ్డిపై పలు కేసులు ఉన్నాయని తెలిపారు.