ఫార్మా కంపెనీల పేరిట ఫేక్ మెడిసిన్

ఫార్మా కంపెనీల పేరిట ఫేక్ మెడిసిన్
  • ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు

జీడిమెట్ల, వెలుగు:  నకిలీ మందులు తయారీ సెంటర్ పై  మేడ్చల్ ఎస్వోటీ, డ్రగ్​ కంట్రోల్ అధికారులు దాడులు చేశారు. రూ.50లక్షల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్​డీసీపీ కోటిరెడ్డి గురువారం మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. ములుగు జిల్లాకి చెందిన గోపాల్​(42) నిజాంపేట్​, మధురానగర్​కాలనీ, సాయిబాలాజీ హైట్స్​లో  ఉంటున్నాడు.  కూకట్​పల్లి ప్రశాంత్​నగర్​లో హరిణి ఇండస్ట్రీస్ పేరుతో ప్లాస్టిక్ ​మౌల్డింగ్​కంపెనీ నిర్వహించగా.. కరోనా సమయంలో ఆర్థికంగా నష్టపోయాడు. దీంతో ఢిల్లీకి చెందిన నిహార్​తో కలిసి ఈజీ మనీ కోసం ప్లాన్ చేశారు.

ప్రముఖ ఫార్మా కంపెనీల మందుల పేరుతో నకిలీ మందులు తయారు చేసేందుకు దూలపల్లిలో ఓ షెడ్డు తీసుకుని అక్కడ  కంపెనీ ఏర్పాటు చేశారు. ఢిల్లీ నుంచి నిహార్​ మందుల లేబుల్స్, ప్యాకింగ్​ మెటీరియల్ పంపేవాడు. ఫార్మా కంపెనీలకు తీసిపోని విధంగా నకిలీ మందులు తయారు చేసి రామకృష్ణ అనే వ్యక్తి ద్వారా మార్కెట్​లో విక్రయించేవారు.  సమాచారంలో మేడ్చల్ ఎస్వోటీ , డ్రగ్​కంట్రోల్​అధికారులు దాడి చేశారు.  నిందితులు గోపాల్, రామకృష్ణను అరెస్ట్​ చేసి రిమాండ్​కి తరలించారు.  నిహార్​ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.