మారని మెడికల్ షాపుల తీరు.. 200 % ఎక్కువ రేటుకు అమ్ముతున్న మందులు

గత కొన్ని నెలలుగా తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారులు విస్తృతంగా దాడులు చేపడుతున్నా.. మెడికల్ షాపుల యాజమాన్యాల తీరు మాత్రం మారడం లేదు. ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుని వారిని దోపిడి చేసే ప్రయత్నం చేస్తు్న్నారు. జూలై 12,  2024 ఉదయం నుంచి తెలంగాణ వ్యాప్తంగా చాలా మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు చేపట్టారు. 

Also Read:జమ్మూ కశ్మీర్ లో 4.2 తీవ్రతతో భూకంపం..

క్యాన్సర్ నిరోధక మందులను అధిక ధరలకు అమ్ముతున్నట్లు గుర్తించారు.200 శాతం అధిక ధరలకు క్యాన్సర్ మందులను అమ్ముతున్నట్టు అధికారులు నిర్ధారించారు. హైదరాబాద్, కరీంనగర్లోని పలు మెడికల్ షాపులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.