- పాన్ డబ్బాలు, కిరాణా షాపుల్లోనూ ఈజీగా దొరుకుతున్నది
- ఇది చాలా ప్రమాదకరం.. సీపీలు, టీ న్యాబ్డైరెక్టర్ ఆవేదన
- డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా మారుద్దామని పిలుపు
- స్కూల్స్‌లో యాంటీ డ్రగ్స్ కమిటీ ఉండాలి: హైదరాబాద్ సీపీ శ్రీనివాస్‌రెడ్డి
- భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు: సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి
- ఓ తండ్రిగా బాధేస్తున్నది: రాచకొండ సీపీ తరుణ్ జోషి
- పేరెంట్స్ నిర్లక్ష్యంగా ఉండొద్దు: టీ న్యాబ్డైరెక్టర్ శాండిల్యా
- కమిటీల ఏర్పాటుకు గైడ్‌లైన్స్ జారీ చేస్తామన్న బుర్రా వెంకటేశం
హైదరాబాద్, వెలుగు: డ్రగ్స్ నెట్వర్క్ దేశాన్నే కాకుండా.. యావత్ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు కూడా డ్రగ్స్ కల్చర్ పాకిందని ఆందోళన వ్యక్తం చేశారు. పబ్స్, కిరాణా షాపులు, పాన్ డబ్బాలు, టిఫిన్ సెంటర్స్‌లో ఈజీగా డ్రగ్స్ దొరుకుతున్నాయన్నారు. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా మార్చాలని సూచించారు. నార్కోటిక్ టెర్రరిజాన్ని రూపుమాపేందుకు స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసిందని తెలిపారు. విద్యాశాఖ అధికారులు, టీచర్స్, స్టూడెంట్స్, పేరెంట్స్ భాగస్వామ్యంతో డ్రగ్స్, గంజాయిపై యుద్ధం ప్రకటించిందన్నారు.
‘డ్రగ్స్‌ఫ్రీ హైదరాబాద్’ పేరుతో సిటీ పోలీస్, సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో సదస్సు నిర్వహించారు. వెయ్యి స్కూల్స్‌కు చెందిన స్టూడెంట్స్, వారి తల్లిదండ్రులు, టీచర్లు ఈ సదస్సుకు హాజరయ్యారు. డ్రగ్స్, గంజాయి వల్ల కలిగే అనర్థాలను సీపీ శ్రీనివాస్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
మనకెందుకులే అనే ధోరణి వద్దు: శ్రీనివాస్ రెడ్డి
డ్రగ్స్ అమ్మడం ద్వారా వచ్చే డబ్బులు టెర్రరిస్టుల చేతుల్లోకి వెళ్తున్నాయని సీపీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ‘‘డ్రగ్స్ మహమ్మారి రాష్ట్రమంతా వ్యాపిస్తున్నదని విద్యార్థుల తల్లిదండ్రులు భయపడుతున్నారు. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా మార్చేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నది. అందులో అందరూ భాగస్వాములు కావాలి. మా స్కూల్ క్యాంపస్‌లోకి డ్రగ్స్ రాలేదు.. మాకెందుకు? అనే ధోరణిలో ఎవరూ ఉండొద్దు. చుట్టుపక్క క్యాంపస్‌లపై కూడా నిఘా పెట్టాలి. స్టూడెంట్స్ ప్రవర్తనను టీచర్స్, పేరెంట్స్ గమనిస్తూ ఉండాలి. ప్రతి స్కూల్లో యాంటీ డ్రగ్స్ కమిటీ ఉండాలి’’అని సూచించారు. విద్యా శాఖతో కలిసి ఫోరమ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. టెక్నాలజీ, ట్రెడిషన్, టాలెంట్ లో తెలంగాణ టాప్‌లో ఉండాలన్నారు.
తల్లిదండ్రుల ఒత్తిడీ కారణమే: సందీప్ శాండిల్య
తమ పిల్లలను ప్రేమతో పెంచాలని, నిర్లక్ష్యం చేయొద్దని టీఎస్ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా సూచించారు. ‘‘కొందరు పేరెంట్స్ తమ పిల్లలకు ప్రేమకు బదులు డబ్బులిస్తున్నరు. స్టూడెంట్స్ డ్రగ్స్ బారినపడటానికి తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా ఉంది. డ్రగ్స్ తీసుకునేవారి సినిమాలు బహిష్కరించాలి. మూవీల్లో డ్రగ్స్ సన్నివేశాలను బ్యాన్ చేయాలి. కొందరు తల్లిదండ్రులు పార్టీలు, ఫంక్షన్లపై పెట్టిన శ్రద్ధ పిల్లలపై పెట్టడం లేదు. ర్యాంకుల కోసం ఒత్తిడి చేయడంతో కూడా డ్రగ్స్ బారినపడే ప్రమాదం ఉంది’’అని అన్నారు. స్టూడెంట్స్ ఏం కోరుకుంటున్నారో తలిదండ్రులు, టీచర్స్ అర్థం చేసుకోవడం లేదని చెప్పారు. ర్యాంకులు, గ్రేడ్లు అంటూ వాళ్లపై ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు.
‘‘పిల్లలకు సిగరెట్లు అమ్మే పాన్‌షాప్ వాడిని, మందు విక్రయించే వాళ్లను పట్టుకుంటున్నాం. నిబంధనలు పాటించకుండా అమ్మేవారిపై కఠినంగా ఉండాలి. ప్రతి ఒక్క స్టూడెంట్లో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. డ్రగ్స్ కంట్రోల్ చేయడం ఒక పోలీసుల బాధ్యత మాత్రమే కాదు. డ్రగ్స్ నిర్మూలించే పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలి. ట్రెండ్ సెట్టర్స్‌గా మారాలి. అందులో స్టూడెంట్స్ పాత్ర కూడా ఉండాలి’’అని సూచించారు.
సరదా..వ్యసనమైతున్నది: అవినాశ్ మహంతి
సమాజానికి డ్రగ్స్ అత్యంత ప్రమాదకరమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి అన్నారు. ‘‘కొందరు రిలీఫ్ అయ్యేందుకు.. పార్టీలు చేసుకునేటప్పుడు డ్రగ్స్ తీసుకుంటున్నారు. అది కాస్త అలవాటుగా మారి దానికి బానిసలవుతున్నారు. భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. స్టూడెంట్స్ డ్రగ్స్ బారినపడకుండా ఉండేందుకు టీచర్స్, పేరెంట్స్, ఫ్రెండ్స్ కలిసికట్టుగా పోరాడాలి. మహమ్మారిని తరిమికొట్టాలి’’అని కోరారు. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా మార్చడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు.
స్టూడెంట్స్ భవిష్యత్తు కాపాడాలి: తరుణ్ జోషి
యువత డ్రగ్స్ బారినపడటం ఓ తండ్రిగా తనను బాధిస్తున్నదని రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి అన్నారు. మత్తు పదార్థాలను కట్టడి చేయకపోతే భవిష్యత్ తరాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ డ్రగ్స్ నిర్మూలనను బాధ్యతగా తీసుకోవాలన్నారు. మహమ్మారిని అణిచివేసేందుకు ముందుకు రావాలని కోరారు. తమకెందుకులే అనే ధోరణి వీడాలన్నారు. స్టూడెంట్స్ భవిష్యత్తు నాశనం అవుతుంటే చూస్తూ కూర్చొవద్దన్నారు. స్కూల్స్, కాలేజీల్లో డ్రగ్స్ వాడుతున్నట్టు తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.
డ్రగ్స్ నివారణ కమిటీలు తప్పనిసరి: బుర్రా వెంకటేశం
ప్రతి స్కూల్ లో డ్రగ్స్ నివారణ కమిటీలు ఏర్పాటు చేసేందుకు గైడ్‌లైన్స్ రిలీజ్ చేస్తామని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చీఫ్ సెక్రటరీ బుర్రా వెంకటేశం అన్నారు. కమిటీలకు త్వరలోనే పేరు నిర్ణయిస్తామని తెలిపారు. ‘‘డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్‌లో యాంటీ డ్రగ్ కమిటీలు ఎంతో ముఖ్యం. అయితే.. ఈ కమిటీల్లో డ్రగ్ అనే పదం లేకుండా కొత్త పేరుతో కమిటీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది” అని ఆయన అన్నారు.
వెంటనే పోలీసులకు చెప్పాలి: దేవసేన
కొన్ని స్కూల్స్‌లో డ్రగ్స్ కల్చర్ పెరిగిందని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ దేవసేన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ సిబ్బంది, స్టూడెంట్స్ కలిసికట్టుగా దీన్ని అడ్డుకోవాలన్నారు. ‘‘స్టూడెంట్స్ డ్రగ్స్ వాడుతున్నట్టు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అది చేయకుండా.. స్కూల్ లేదా కాలేజ్ కు బ్యాడ్ నేమ్ వస్తుందని ఊరుకోవడం కరెక్ట్ కాదు. ఏ కొంచెం అనుమానం ఉన్నా.. పోలీసులకు చెప్తే విషయాన్ని గోప్యంగా ఉంచుతారు. సమస్యను పరిష్కరిస్తారు’’అని సూచించారు.
తమ పిల్లలను ప్రేమతో పెంచాలని, నిర్లక్ష్యం చేయొద్దని టీఎస్ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా సూచించారు. ‘‘కొందరు పేరెంట్స్ తమ పిల్లలకు ప్రేమకు బదులు డబ్బులిస్తున్నరు. స్టూడెంట్స్ డ్రగ్స్ బారినపడటానికి తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా ఉంది. డ్రగ్స్ తీసుకునేవారి సినిమాలు బహిష్కరించాలి. మూవీల్లో డ్రగ్స్ సన్నివేశాలను బ్యాన్ చేయాలి. కొందరు తల్లిదండ్రులు పార్టీలు, ఫంక్షన్లపై పెట్టిన శ్రద్ధ పిల్లలపై పెట్టడం లేదు. ర్యాంకుల కోసం ఒత్తిడి చేయడంతో కూడా డ్రగ్స్ బారినపడే ప్రమాదం ఉంది’’అని అన్నారు.
స్టూడెంట్స్ ఏం కోరుకుంటున్నారో తలిదండ్రులు, టీచర్స్ అర్థం చేసుకోవడం లేదని చెప్పారు. ర్యాంకులు, గ్రేడ్లు అంటూ వాళ్లపై ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. ‘‘పిల్లలకు సిగరెట్లు అమ్మే పాన్‌షాప్ వాడిని, మందు విక్రయించే వాళ్లను పట్టుకుంటున్నాం. నిబంధనలు పాటించకుండా అమ్మేవారిపై కఠినంగా ఉండాలి. ప్రతి ఒక్క స్టూడెంట్లో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. డ్రగ్స్ కంట్రోల్ చేయడం ఒక పోలీసుల బాధ్యత మాత్రమే కాదు. డ్రగ్స్ నిర్మూలించే పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలి. ట్రెండ్ సెట్టర్స్‌గా మారాలి. అందులో స్టూడెంట్స్ పాత్ర కూడా ఉండాలి’’అని సూచించారు.