నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలో డ్రగ్ ముఠాను పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఢిల్లీ నుంచి వచ్చిన డ్రగ్ ను హైదరాబాద్ కు తరలిస్తుండగా పక్కా సమాచారంతో నిందితులను పట్టుకున్నారు పోలీసులు. 12.3 గ్రాముల కొకైన్, 3 గ్రాముల MDMA, 3.1 గ్రాముల గంజాయి పౌడర్, ఒక స్కోడా కారును సీజ్ చేశారు.
హైదరాబాద్ కు చెందిన విక్రమ్ రెడ్డి, గుంటూరు జిల్లా చిలకలూరి పేటకు చెందిన షేక్ ఖాజా మొయినుద్దీన్ అరెస్ట్ చేశారు పోలీసులు.న్యూ ఇయర్ సందర్భంగా డ్రగ్స్ అమ్మడానికి తరలిస్తున్నట్టు వెల్లడించారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.