కారేపల్లి, వెలుగు: అక్రమంగా ఇంట్లో నిల్వ చేసిన రూ.2 లక్షల విలువైన అల్లోపతి మందులను గురువారం డ్రగ్ ఇన్స్పెక్టర్లు సీజ్ చేశారు. ఖమ్మం, కొత్తగూడెం డ్రగ్ ఇన్స్పెక్టర్లు డీ. దేవేందర్ రెడ్డి, సీహెచ్ సంపత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పోలంపల్లికి చెందిన ఈసాల రాజు తన ఇంట్లో 75 రకాల అల్లోపతి మందులను నిల్వ చేశాడు.
పక్కా సమాచారంతో దాడులు చేసి మందులను స్వాధీనం చేసుకున్నారు. రాజు పై కేసు నమోదు చేశారు. సీజ్ చేసిన మందులను ఏజేఎఫ్ సీఎం కోర్టుకు అప్పగించినట్లు తెలిపారు