హైదరాబాద్ లో డ్రగ్ పార్టీ.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న నార్కోటిక్ పోలీసులు..

హైదరాబాద్ లో డ్రగ్ పార్టీ..  రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న నార్కోటిక్ పోలీసులు..

హైదరాబాద్ లోని పలు క్లబ్బులపై అర్థరాత్రి తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో, సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు రైడ్స్ చేశారు. మణికొండ లోని కేవ్ క్లబ్ లో రైడ్ చేయగా.. డ్రగ్స్ తీసుకున్న వారిని పట్టుకున్నారు. అదుపులోకి తీసుకున్న అదుపులోకి తసుకున్నారు. 55 మందికి డ్రగ్ పరీక్షలు నిర్వహించగా 24మందికి పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది . వీకెండ్ సందర్భంగా కేవ్ పబ్బులో డ్రగ్స్ పార్టీ నిర్వహించారని వెల్లడించారు. 

దొరికిన వాళ్ళు అంతా 25నుండి 30ఏళ్ల వయస్సులోపు వారేనని అన్నారు. డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిన వారిని రాయదుర్గం పీఎస్ కు తరలించామని పోలీసులు వెల్లడించారు. ఆదివారం ఉదయం ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు పోలీసులు తెలిపారు.  పంచనామా అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని వెల్లడించారు. 

డ్రగ్ పార్టీ పై రాయదుర్గం ఇన్స్ పెక్టర్ వెంకన్న మాట్లాడుతూ పబ్ పై దాడులు చేసి టెస్టుల్లో పాజిటివ్ వచ్చిన వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. సుమారు 50 మందికి టెస్ట్ లు చేయగా 24మందికి పాజిటివ్ వచ్చిందన్నా. వారందని అదుపులోకి తీసుకున్నామన్నారు. పబ్ నిర్వాహకులు,డిజె ఆపరేటర్ లు ప్రధానంగా ఉన్నారని తెలిపారు. 

ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు.  పబ్ లో తనికీలు చేస్తే అక్కడ ఏం దొరకలేదని వెల్లడించారు. గంజాయి,మత్తు పదార్ధాలు సేవించిన వాళ్లకు కూడా టెస్ట్ లు చేశామన్నారు. పబ్ ఓనర్ పై కేసు నమోదు చేయనున్నటు సమాచారం.