హైదరాబాద్: డ్రగ్స్ పెడ్లర్ మోహిత్ ను నార్కోటిక్ వింగ్ పోలీసులు అరెస్టు చేశారు. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ లో కొకైన్ సప్లై చేస్తుండగా ఎఫ్ హౌజ్ పబ్ లో అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 31వ తేదీన రాత్రి చాలా మందికి డ్రగ్స్ సప్లై చేసినట్లు గుర్తించారు. మోహిత్ కాంటాక్స్ లిస్ట్ లో చాలా మంది పేర్లున్నట్లు చెబుతున్నారు.
మోహిత్ తో పాటు మరో బిజినెస్ మెన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ టార్గెట్ గా డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ కింగ్ పిన్ ఎడ్విన్ తో మోహిత్ కు సంబంధాలున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో బయటపడింది. మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.