ముంబై నుంచి హైదరాబాద్ కు తరిలిస్తున్న డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు నార్కోటిక్ బ్యూరో పోలీసులు. 320 గ్రాముల MDMA డ్రగ్స్ తోపాటు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.హైదరాబాద్ కు చెందిన వసీమ్ ఖాన్ ముంబై నుంచి డ్రగ్స్ తెస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు బస్సులో ముంబై నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొస్తుండగా వసీమ్ ఖాన్ ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడు అయాన్ కోసం గాలిస్తున్నారు పోలీసులు.
డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక నిఘా పెట్టిన హైదరాబాద్ పోలీసులు డ్రగ్స్ సరఫరాను అడ్డుకుంటున్నారు. చెక్ పోస్టుల దగ్గర.. నగర సరిహద్దుల దగ్గర తనిఖీలు చేపట్టి నిందితులను అరెస్ట్ చేస్తున్నారు.