Health Alert :ఈ ఐ డ్రాప్స్ మందును నిషేధించారు..ఎవరూ కొనొద్దు..!

Health Alert :ఈ ఐ డ్రాప్స్ మందును నిషేధించారు..ఎవరూ కొనొద్దు..!

ఓ పక్క వింత వింత రోగాలు..మరో పక్క నకిలీ డాక్టర్లు..నొప్పి వచ్చిందని ఆస్పత్రులకు వెళితే..వారిచ్చే మందులు సైతం కల్తీ..రోగమొచ్చిందని మందులు ఉన్న ప్రాణాలు పోయేలా ఉన్నాయి. DCGI అనుమతి పొంది ఫార్మాస్యూటికల్ కంపెనీలు నకిలీ మందులు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చలగామాడుతున్నాయి.నకిలీ మందులు తయారు చేస్తున్న ముంబైకి చెందిన ఎంటోడ్ ఫార్మా స్యూటికల్స్ కంపెనీకి చెందిన కంటి చుక్కల మందు (ఐ డ్రాప్స్ ) DCGI నిషేధించింది.  

సెంట్రల్ లైసెన్సింగ్ అథారిటీ అనుమతి లేని ఔషధ ఉత్పత్తి కోసం క్లెయిమ్ చేయడం ద్వారా కొత్త డ్రగ్స్, క్లినికల్ ట్రయల్ రూల్స్ 2019ని ఈ కంపెనీ ఉల్లంఘించిందని తెలిపింది.ప్రెస్‌బి యోపియా ఉన్న వ్యక్తులకు కంటిచూపుకోసం సహాయపడుతుందని కంపెనీ వాదిస్తోంది..నేషనల్ ఐ ఇనిస్టిట్యూట్ ప్రకారం.. ప్రెస్ బియోపియా అనేది వక్రీభవన లోపం.. ఇది మధ్య వయస్కులు, వృద్ధుల దగ్గరి చూపు సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది.